ETV Bharat / sports

'నేను భారతీయుడ్ని.. హిందీలోనే మాట్లాడుతా' - Rohit live chat with Bumrah

లాక్​డౌన్​ కారణంగా ఇంట్లోనే ఉన్న భారత క్రికెటర్​ రోహిత్​ శర్మ.. సహచరులతో లైవ్​ చాట్​ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు​.

ROHIT SHARMA
ఇంటర్వ్యూలోనే ఇంగ్లీష్​.. ఇంట్లో హిందీయే.!
author img

By

Published : Apr 2, 2020, 12:07 PM IST

Updated : Apr 2, 2020, 12:15 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా టోర్నీలు, లీగ్​లు నిలిచిపోవడం వల్ల క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఉప సారథి రోహిత్ శర్మ.. సోషల్‌మీడియాలో పలువురు క్రికెటర్లతో లైవ్‌చాట్‌ చేశాడు. అందులో భాగంగా పేసర్​​ బుమ్రాతో, హిందీలో మాట్లాడాడు. కొందరు అభిమానులు అతడిని ఇంగ్లీష్‌లో మాట్లాడాలని కోరారు. తాము భారతీయులమని, హిందీలోనే మాట్లాడతామని స్పష్టం చేశారు.

టీవీ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతానని, ప్రస్తుతం ఇంట్లో ఉన్నందున హిందీలో మాట్లాడుతున్నట్లు హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

రోహిత్​కు మద్దతుగా బుమ్రా

రోహిత్​ శర్మకు అండగా నిలిచాడు బుమ్రా. 'మనం హిందీలో మాట్లాడితే వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడమంటారు, ఇంగ్లీష్‌లో మాట్లాడితే హిందీలో మాట్లాడమంటారు' అని అన్నాడు. కరోనా వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని తానెప్పుడూ ఊహించలేదని జస్ప్రీత్ చెప్పాడు.

వైరస్‌ వ్యాప్తి వల్ల అన్ని క్రికెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీన్నిబట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కొందరు అభిమానులను ఉద్దేశించి రోహిత్​ అన్నాడు. ప్రతి ఒక్క పౌరుడిని ఇంట్లోనే ఉండి, తరచూ చేతులు కడుక్కోవాలని సూచించాడు.​

రూ.80 లక్షలు విరాళమిచ్చిన రోహిత్​

కరోనాపై పోరాటానికి రోహిత్​శర్మ రూ.80లక్షల విరాళమిచ్చాడు. 'పీఎం-కేర్స్'​కు రూ. 45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందించాడు. జొమాటో ఫీడింగ్​ ఇండియాకు రూ.5 లక్షలు, వీధి కుక్కల సంక్షేమ శాఖకు రూ.5 లక్షలు విరాళమిచ్చాడు.

కరోనా కట్టడికోసం బీసీసీఐ రూ. 51కోట్లు విరాళమిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ, దిగ్గజ సచిన్​ తెందుల్కర్​, సీనియర్ క్రికెటర్​ సురేశ్ రైనా విరాట్​ కోహ్లీలు తమవంతు సాయమందించారు.

భారత మహిళా క్రికెటర్లలో​ మిథాలీ రాజ్​ రూ. 10లక్షలు... రిచాఘోష్​, పూనమ్​యాదవ్​లు రూ.లక్ష చొప్పున విరాళమిచ్చారు.

ఇదీ చదవండి: టీమిండియా 28 ఏళ్ల కల నెరవేరిన ఆ క్షణం

Last Updated : Apr 2, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.