ETV Bharat / sports

'రోహిత్​.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్' - రోహిత్​ శర్మ తాజా వార్తలు

అంతర్జాతీయ క్రికెట్​లో గొప్ప ఆల్​టైమ్​ ఓపెనర్లలో రోహిత్​ శర్మ ఒకరని టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కృష్ణమాచారి శ్రీకాంత్​ తెలిపారు. టోర్నీల్లో రోహిత్​ సెంచరీలు చేసే తీరు అద్భుతమని కొనియాడారు.

Rohit is one of greatest ever ODI openers: Srikkanth
రోహిత్​ శర్మ
author img

By

Published : Jul 1, 2020, 5:32 AM IST

Updated : Jul 1, 2020, 7:08 AM IST

వన్డేల్లో అత్యుత్తమ ఓపెనర్లలో టీమ్​ఇండియా స్టైలిష్​ బ్యాట్స్​మన్​ రోహిత్​ శర్మ కూడా ఒకరని మాజీ కెప్టెన్​ కృష్ణమాచారి శ్రీకాంత్​ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోహిత్​ సెంచరీలు చేసే నైపుణ్యం అద్భుతమంటూ కితాబిచ్చారు.

Rohit is one of greatest ever ODI openers: Srikkanth
రోహిత్​ శర్మ

టీమ్​ఇండియా తరఫున ఒకప్పుడు ఓపెనర్​గా ఉన్న శ్రీకాంత్.. అత్యుత్తమ ఓపెనర్ల జాబితాలో రోహిత్​ టాప్​3, టాప్​ 5 స్థానాల్లో ఉంటాడని అభిప్రాయపడ్డారు.

"అంతర్జాతీయ క్రికెట్​లో గొప్ప ఆల్​ టైమ్​ ఓపెనర్లలో ఒకరిగా రోహిత్​కు మద్దతిస్తా. శతకాలు, డబుల్​ సెంచరీలు సాధించేందుకు అతని పోరాటం అద్భుతం. వన్డే మ్యాచ్​ల్లో మీరు 150, 180, 200 వరకు స్కోరు సాధిస్తుంటే.. మీ జట్టును ఎక్కడి వరకు తీసుకెళ్లనున్నారో ఓ సారి ఊహించుకోండి. అదే రోహిత్​లో ఉన్న గొప్పతనం."

-కృష్ణమాచారి శ్రీకాంత్​, భారత మాజీ కెప్టెన్​

రోహిత్​ ఇప్పటివరకు సాధించిన 29 వన్డే శతకాల్లో.. మూడు డబుల్​ సెంచరీలతో సహా 11సార్లు 140 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 224 వన్డేలు ఆడిన హిట్​మ్యాన్.. 29 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు సాధించాడు. 49.27 సగటుతో 9115 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) ఇతడి పేరిటే ఉంది.

ఇదీ చూడండి:2011 ప్రపంచకప్‌ ఫైనల్‌పై క్రిమినల్‌ దర్యాప్తు

Last Updated : Jul 1, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.