ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తాత్కాలిక సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఆ స్థానానికి అతడే అర్హుడని అన్నాడు. టెస్టు సిరీస్‌లోని చివరి మూడు మ్యాచ్‌లకు సారథి విరాట్ దూరమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమవ్వడం జట్టుపై పెద్ద ప్రభావం చూపొచ్చు. కానీ అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. ఎందుకంటే క్రికెట్ కన్నా కుటంబం ఎంతో ముఖ్యమన్న విషయాన్ని మనం అంగీకరించాలి. కానీ మైదానంలో విరాట్ స్థానం భర్తీ చేయడం చాలా కష్టం. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు రాణించినా విధానమే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఆ స్థానాన్ని రహానెకు బదులు రోహిత్‌కు ఇవ్వాలని నా అభిప్రాయం. ఎందుకంటే అతడూ సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఎంతో అనుభవముంది. ఓపెనర్‌గా అతడి పాత్ర ఎంతో కీలకం. రోహిత్ కెరీర్ ప్రారంభించిన కొత్తలో 2008లో ఆస్ట్రేలియా పిచ్‌లపై బాగా ఆడాడు. కాబట్టి తాత్కాలిక సారథిగా అతడైతేనే సరియైన వ్యక్తి"
-ఇర్ఫాన్ పఠాన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. కాబట్టి విరాట్ పితృత్వ సెలవులు తీసుకుని స్వదేశానికి రానున్నాడు. అప్పుడు తాత్కాలిక సారథిగా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానెకు నియమించే అవకాశముంది. కాబట్టి అతడికి బదులుగా రోహిత్‌ను ఎంపిక చేయాలని సూచించాడు ఇర్ఫాన్.
నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.
ఇదీ చూడండి : ఆసీస్‌తో టెస్టులకు కోహ్లీ దూరం.. రోహిత్‌కు అవకాశం