ఆస్ట్రేలియా-ఎ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 73 బంతుల్లోనే సెంచరీ చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో తొలి టెస్టు కోసం ఇతడి పేరు పరిశీలించాల్సిన పరిస్థితిని సెలక్టర్లకు తీసుకొచ్చాడు.
అయితే రెండో రోజు చివరి ఓవర్‌కు ముందు 81 పరుగులతో ఉన్న పంత్.. కేవలం ఆ ఓవర్లో 22 పరుగులు ఎందుకు చేశాడో వెల్లడించాడు. అందుకు గల కారణాన్ని చెప్పాడు.
"రెండో ఇన్నింగ్స్‌లో నేను బ్యాటింగ్‌కు దిగేటప్పటికి చాలా ఓవర్లు ఉన్నాయి. విహారి, నేను బలమైన భాగస్వామ్యం నిర్మించాలని అనుకున్నాం. అందుకు తగ్గట్లుగానే ఆడాం. నేను నెమ్మదిగా ఆడి నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నా. సెంచరీ చేయాలంటే మరో 20 పరుగులు చేయాలి, ఒకే ఓవర్ ఉంది.. కష్టమేమో అనుకున్నా. అయితే చివరి ఓవర్ తొలి బంతి నా పొట్టకు తగలడం వల్ల కోపమొచ్చింది. దీంతో షాట్లు కొట్టాలని నాకు నేను చెప్పుకున్నా. ఒకవేళ అవుతుందంటే చేయ్ లేదంటే రేపు ఆడుకోవచ్చు అని విహారి చెప్పాడు. కానీ ప్రయత్నిస్తానని చెప్పా. బౌలర్ వేస్తుంటే నేను షాట్లు కొట్టా. శతకం పూర్తయింది"
-రిషభ్ పంత్, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్
నెలరోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఉన్న తనకు ఈ సెంచరీ ఆత్మవిశ్వాసం నింపిందని పంత్ అన్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో ఈనెల 17 నుంచి తొలి టెస్టు జరగనుంది. ఇది డే/నైట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఇది చదవండి: శతకంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు: పంత్