పంత్‌ను ఒత్తిడికి గురిచేయకుండా, కొంత సమయం ఇస్తే కచ్చితంగా తన ప్రతిభను నిరూపించుకుంటాడని అన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. జట్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మెరుగయ్యాడని తెలిపాడు.
"రాబోయే రోజుల్లో పంత్ ఇంకా నిబద్ధతతో ఆడతాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒత్తిడి సహజం. అయితే ఇదే తరహా(మూడో టీ 20) ప్రదర్శన కొనసాగిస్తే పంత్.. ఇండియా తరపున మంచి ఆటగాడవుతాడు" -విరాట్ కోహ్లీ, భారత సారథి.
ధోని వారసుడిగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్.. విండీస్‌తో సిరీస్‌లో మెుదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఈ కారణంగా తీవ్రంగా విమర్శలు ఎదుర్కున్నాడు. ఆదివారం జరిగిన మూడో టీ-20లో 42 బంతుల్లో 65 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు పంత్.
దీపక్ చాహర్‌ను భువనేశ్వర్‌తో పోల్చాడు కోహ్లీ. భువి బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలో పడేస్తాడని, అతడి దారిలోనే దీపక్ వెళ్తున్నాడని తెలిపాడు.
మూడో టీ-20లో మొదటి స్పెల్‌లో మూడు ఓవర్లు వేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు చాహర్.
ఇదీ చూడండి: షారుఖ్‌కు 'ఎక్సలెన్స్ ఇన్ సినిమా' అవార్డు