ETV Bharat / sports

'ఈసారి సిరాజ్‌, సుందర్‌ అదరగొట్టడం ఖాయం'

వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్​ వంటి యువ ఆటగాళ్లు ఈ సారి ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వారు టీమ్ఇండియాకు ఆడడం తమకు సానుకూల అంశమని తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభావం చూపగల సత్తా వారి సొంతమని కొనియాడాడు.

RCB captain Kohli has said that Sundar and Siraj will do well in the IPL
'ఈసారి సిరాజ్‌, సుందర్‌ అదరగొట్టడం ఖాయం'
author img

By

Published : Apr 9, 2021, 7:52 AM IST

Updated : Apr 9, 2021, 8:27 AM IST

టీమ్‌ఇండియాకు ఆడిన ఆత్మవిశ్వాసంతో వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌ వంటి యువకులు ఆర్‌సీబీ తరఫున అదరగొడతారని ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. భారత్‌కు ఆడటం సైని, సుందర్‌, సిరాజ్‌, యూజీ వ్యక్తిత్వాలను మార్చేసిందని పేర్కొన్నాడు. తమ జట్టు సరైన దిశలో పయనించేందుకు, బృందంగా రాణించేందుకు వారి అనుభవం సాయపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

"మా కుర్రాళ్లు మరింత ఆత్మవిశ్వాసం, అనుభవం పొందారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు ప్రభావం చూపగలరని ప్రత్యర్థులకూ తెలుసు. ఇది మాకు శుభసూచిక. ఏదేమైనా చిన్నస్వామిలో ఆడినంత మజా ఉండదు. కానీ ఐపీఎల్‌ స్వదేశానికి రావడం సానుకూల అంశం. అయితే ఈసారీ ఎవరికీ సొంతమైదాన ప్రయోజనం లేదు. ప్రతి జట్టు తటస్థ వేదికల్లోనే ఆడుతోంది. సొంత బలాలపై ఆధాపడతారు కాబట్టి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే 3-4 మ్యాచులను కాపాడుకోవాలి. ఇక టోర్నీకి వ్యూయర్‌షిప్‌ పెరగడం గొప్ప విషయం" అని కోహ్లీ అన్నాడు.

"గతేడాది పోటీలో మేం నిలబడ్డాం. ఈ సారీ మేం గట్టి పోటీనిస్తామన్న విశ్వాసం ఉంది. కొత్త కుర్రాళ్లు రావడం ఆసక్తికరంగా ఉంది. మాక్స్‌వెల్‌ వచ్చాడు. రిచర్డ్‌సన్‌ చేరాడు. డాన్‌ క్రిస్టియన్, డేనియెల్‌ సామ్స్‌, భారత ఆటగాళ్లూ చేరారు. ఇప్పుడున్న వనరుల పట్ల సంతృప్తిగా ఉంది. తొలి మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మా కోచ్‌లు ఉపయోగిస్తున్న భాష చాలా బాగుంది. కోచింగ్‌ బృందంలో కొందరు కొత్తవాళ్లు వచ్చినా స్వేచ్ఛను ఇస్తున్నారు" అని విరాట్‌ తెలిపాడు.

ఇదీ చదవండి: కరోనా వేళ క్రికెట్‌ మేళా.. నేటి నుంచే ఐపీఎల్​

Last Updated : Apr 9, 2021, 8:27 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.