న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కోలుకుంటున్నాడని జట్టు తెలిపింది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ప్రకటించింది.
కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది అఫ్గానిస్థాన్. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్ వేసిన బంతి రషీద్ ఖాన్ తలకు తగిలింది. వైద్య పరీక్షలు చేసిన అనంతరం రషీద్‌కు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.
"న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రషీద్ ఫీల్డింగ్‌కు వెళ్లవద్దని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయముంది. అప్పటివరకు రషీద్ పూర్తిగా కోలుకుంటాడు".
--గుల్బదిన్ నయీబ్, అఫ్గాన్ సారథి
ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి నిరాశలో కూరుకుపోయింది అఫ్గాన్. ఇప్పటికే ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్ మహ్మద్ హెజాద్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ఇవీ చదవండి.. డివిలియర్స్‌పై అక్తర్ మండిపాటు