ETV Bharat / sports

రంజీలో నయా విజేత.. తొలి టైటిల్​ ముద్దాడిన సౌరాష్ట్ర - jaydev Unadkat-

రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర నయా విజేతగా ఆవిర్భవించింది. నాలుగోసారి ఫైనల్​ చేరిన ఈ జట్టు.. తొలిసారి ట్రోఫీ అందుకుంది. రాజ్​కోట్​ వేదికగా బంగాల్​తో జరిగిన తుదిపోరు డ్రా కాగా.. తొలి ఇన్నింగ్స్​లో ఆధిక్యం సాధించిన సౌరాష్ట్రను విజేతగా ప్రకటించారు.

Ranji Trophy 2020: Jaydev Unadkat led Saurashtra win over Bengal and lifted 1st-ever title
తొలిసారి రంజీ ట్రోఫీ ముద్దాడిన సౌరాష్ట్ర
author img

By

Published : Mar 13, 2020, 4:19 PM IST

సౌరాష్ట్ర రంజీ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. రంజీ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్​ మ్యాచ్​లో బంగాల్‌తో తలపడిన ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా కావడం వల్ల.. మొదటి ఇన్నింగ్స్‌ ఆధారంగా సౌరాష్టను టైటిల్‌ వరించింది.

శుక్రవారం చివరి రోజు ఆటలో బంగాల్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్‌ మ్యాచ్‌లు డ్రా అయితే.. విజేతను తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా ప్రకటించే నిబంధన ఉంది.

Ranji Trophy 2020
ట్రోఫీతో సౌరాష్ట్ర కెప్టెన్​ జయదేవ్​ ఉనద్కత్​, బ్యాట్స్​మన్​ పుజారా

బౌలర్ల వల్లే..

తాజా రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది నిన్నటి వరకూ ఆసక్తి కొనసాగింది. గురువారం ఆట ముగిసే సమయానికి బంగాల్‌ 6 వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. ఫలితంగా ఈ రోజు ఆటలో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరును బంగాల్‌ జట్టు అధిగమిస్తుందని అంతా భావించారు. కానీ సౌరాష్ట్ర బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 27 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది బంగాల్‌. ఓవర్‌నైట్‌ ఆటగాడు మజుందార్‌(63) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్‌ నంది(40 నాటౌట్‌) అజేయంగా నిలిచినా మిగతా బ్యాట్స్​మన్​ విఫలమవడం వల్ల బెంగాల్‌కు ఆధిక్యం దక్కలేదు. చివరకు మ్యాచ్‌ కూడా డ్రాగా ముగియడం వల్ల సౌరాష్ట్ర ట్రోఫీని ముద్దాడింది. సెంచరీతో రాణించిన ఆ రాష్ట్ర బ్యాట్స్​మన్​ అర్పిత్​ను 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​' వరించింది.

స్కోర్లు స్వల్పంగా...

>> సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్​ 425-10 (171.5 ఓవర్లలో)

అర్పిత్​(106), పుజారా (66);

అకాశ్​ దీప్​ 4, షాబాజ్​ అహ్మద్​ 3 వికెట్లు

>> బంగాల్​ తొలి ఇన్నింగ్స్​ 381-10 (161 ఓవర్లలో)

సుధీప్​ ఛటర్జీ(81), వృద్ధిమాన్​ సాహా(64),అనుస్తూప్​ మజుందార్​(63);

ధర్మేంద్రసింగ్​ 3, ప్రేరక్​ 2, ఉనద్కత్​ 2 వికెట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.