దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది భారత మహిళల హాకీ సారథి రాణీ రాంపాల్. ఈ అవార్డు మరిన్ని విజయాలు సాధించేలా స్ఫూర్తి నింపిందని చెప్పింది.
"నాకు ముఖ్యంగా నా కుటుంబానికి ఇది గర్వపడే సందర్భం. దేశంలో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అందుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. కేరీర్ ఆరంభం నుంచి అండగా నిలిచిన నా కోచ్‌లు, సహచరులు, మిత్రులు, కుటుంబసభ్యులకే ఈ ఘనత దక్కుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తే గొప్పగా అనిపిస్తుంది. మరిన్ని మంచి విజయాలు సాధించి, దేశ ఖ్యాతిని పెంచేందుకు నాలాంటి క్రీడాకారిణిలకు ఈ అవార్డు స్ఫూర్తిని అందిస్తుందని నమ్ముతున్నా."
-రాణి, హాకీ ప్లేయర్
రాణితో పాటు ఓపెనర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, పారా ఒలింపిక్ పసిడి విజేత మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రాలను ఈ ఏడాది ఖేల్‌రత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇది చూడండి ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ వైట్ వీడ్కోలు