ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు కాసేపు మెరిపించగా 3.3 ఓవర్లలో స్కోర్ 36కి చేరింది. ఇద్దరూ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ఊతప్ప, నితీష్ రానా కుదురుగా ఆడుతూ పరుగులు సాధించారు.
రానా మెరుపు బ్యాటింగ్
మొదట నెమ్మదిగా ఆడిన రానా తర్వాత వేగం పెంచి బౌండరీలు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలోనే వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధసెంచరీ సాధించాడు. 63 పరుగుల (34 బంతులు, 7 సిక్సులు, 2 ఫోర్లు) వ్యక్తిగత స్కోర్ వద్ద చక్రవర్తి బౌలింగ్‌లో రానా అవుటయ్యాడు. ఊతప్ప 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రసెల్ విధ్వంసం..
రానా అవుయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్ విధ్వంసమే సృష్టించాడు. షమి వేసిన 19 ఓవర్లో వరుసగా మూడు సిక్సులు.. ఓ ఫోర్ సాధించాడు. 17 బంతుల్లో 5 సిక్సులు, 3 బౌండరీలతో 48 పరుగులు చేసి అవుటయ్యాడు.
కోల్‌కతా బౌలర్లలో షమి, చక్రవర్తి, హార్జస్ విల్జోన్, ఆండ్రూ టై చెరో వికెట్ పడగొట్టారు.
ఇవీ చూడండి..'మన్కడింగ్ విషయంలో అశ్విన్ తప్పేమీ లేదు'