ఐపీఎల్ ప్రారంభానికి మరో 40 రోజులు ఉంది. అయినాసరే ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పండగ వాతావరణం నెలకొంది. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఆడబోతున్నామనే ఉత్సాహంలో క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయాడు.
-
Royals Welcomes The KING pic.twitter.com/Qbm3YcVLhi
— Pranjal (@Pranjal_one8) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Royals Welcomes The KING pic.twitter.com/Qbm3YcVLhi
— Pranjal (@Pranjal_one8) August 9, 2020Royals Welcomes The KING pic.twitter.com/Qbm3YcVLhi
— Pranjal (@Pranjal_one8) August 9, 2020
కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తాడని, అందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై స్పందించిన ఫ్రాంచైజీ.. కోహ్లీనీ తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఓ షరతు కూడా ఉందని ట్వీట్ చేసింది. విరాట్‌తో పాటే ఆర్సీబీ ఇన్సైడర్ నాగ్స్ను తీసుకొస్తే.. ఇద్దరినీ జట్టులోకి స్వాగతిస్తామని చమత్కరించింది.
-
Only if @NagsMr comes along too. 🙃 https://t.co/ywmIgoaoGe pic.twitter.com/gLd9PnU3LG
— Rajasthan Royals (@rajasthanroyals) August 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Only if @NagsMr comes along too. 🙃 https://t.co/ywmIgoaoGe pic.twitter.com/gLd9PnU3LG
— Rajasthan Royals (@rajasthanroyals) August 9, 2020Only if @NagsMr comes along too. 🙃 https://t.co/ywmIgoaoGe pic.twitter.com/gLd9PnU3LG
— Rajasthan Royals (@rajasthanroyals) August 9, 2020
ఈ లీగ్ సమయంలో అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు నాగ్స్, కొన్ని షోలు చేస్తుంటాడు. ఫ్రాంచైజీ వార్తలను ఫన్నీగా చదువుతూ అలరిస్తుంటాడు.
బ్యాట్సమన్‌గా సరే.. కెప్టెన్‌గా?
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. 2013లో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కానీ ఇప్పటివరకు ఒక్కసారైనా టైటిల్ గెలుచుకోలేకపోయాడు. ఐపీఎల్లో బ్యాట్స్‌మన్‌గా రికార్డులు నమోదు చేస్తున్నప్పటికీ కెప్టెన్‌గా మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఉత్తమ ఆటగాళ్లు ఉన్న ఆర్సీబీ లాంటి జట్టు ఇప్పటికీ టైటిల్ సొంతం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.