ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆదివారం ఫ్రాంచైజీ వెల్లడించింది. రానున్న లీగ్‌లో టీమ్ మెంటార్‌గానూ వార్న్ వ్యవహరించనున్నట్లు తెలిపింది. దీంతో ఐపీఎల్ ట్రోఫీ సాధించేందుకు జట్టుకు మరింత బలం చేకూరినట్లైంది. ఈ సందర్భంగా వార్న్ మాట్లాడుతూ.. రాయల్స్ బృందంతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నాడు.
-
👋 Welcome back, Warnie. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) September 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Birthday boy @shanewarne joins the side as our mentor & brand ambassador for #IPL2020. 😍#HallaBol | #RoyalsFamily pic.twitter.com/rBJKKPsZDC
">👋 Welcome back, Warnie. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) September 13, 2020
Birthday boy @shanewarne joins the side as our mentor & brand ambassador for #IPL2020. 😍#HallaBol | #RoyalsFamily pic.twitter.com/rBJKKPsZDC👋 Welcome back, Warnie. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) September 13, 2020
Birthday boy @shanewarne joins the side as our mentor & brand ambassador for #IPL2020. 😍#HallaBol | #RoyalsFamily pic.twitter.com/rBJKKPsZDC
"రాజస్థాన్ బృందం నా కుటుంబం లాంటింది. ఇప్పుడు వారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్లో జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. జుబిన్ భారుచా, ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వంటి అద్భుతమైన సిబ్బందితో కలవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కచ్చితంగా ఈ లీగ్‌లో జట్టును విజయం వైపు నడిపిస్తాం."
-షేన్ వార్న్, ఆసీస్ మాజీ స్పిన్నర్
2008 ప్రారంభ ఎడిషన్‌లో వార్న్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం రాజస్థాన్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి వార్న్ టీమ్ మెంటార్‌గా పని చేయనున్నాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.