ముంబయి ఇండియన్స్‌తో తలపడుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జైపుర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు రాజస్థాన్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. రహానేను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం.
-
The @rajasthanroyals Skipper @stevesmith49 wins the toss and elects to bowl first against the @mipaltan.#RRvMI pic.twitter.com/FZy4lbRtPi
— IndianPremierLeague (@IPL) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @rajasthanroyals Skipper @stevesmith49 wins the toss and elects to bowl first against the @mipaltan.#RRvMI pic.twitter.com/FZy4lbRtPi
— IndianPremierLeague (@IPL) April 20, 2019The @rajasthanroyals Skipper @stevesmith49 wins the toss and elects to bowl first against the @mipaltan.#RRvMI pic.twitter.com/FZy4lbRtPi
— IndianPremierLeague (@IPL) April 20, 2019
గత రెండు మ్యాచ్‌ల్లో పిచ్ స్లోగా ఉండి బౌలింగ్‌కు అనుకూలించింది. ఈసారీ మొదట బౌలింగ్ తీసుకునే జట్టుకే కలిసొచ్చే అవకాశముంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో పరాజయం చెందిన రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే.
వరుస విజయాలతో దూసుకెళ్తోంది ముంబయి జట్టు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు పదిలం చేసుకోవాలనుకుంటోంది.
జట్టులో మూడు మార్పులు చేసింది రాజస్థాన్. సోధి స్థానంలో స్టోక్స్ జట్టులోకి వచ్చాడు. రాహుల్ త్రిపాఠి స్థానంలో రియాన్ పరాగ్ ఆడనున్నాడు. బట్లర్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. ముంబయి జట్టులో జయంత్ యాదవ్ స్థానంలో మయాంక్ మార్కండే ఆడనున్నాడు.
జట్లు..
రాజస్థాన్ రాయల్స్..
సంజూ శాంసన్(కీపర్), రహానే, స్మిత్(కెప్టెన్), స్టోక్స్, టర్నర్, స్టువర్ట్ బిన్ని, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ఉనాద్కత్, ధవల్ కులకర్ణి
ముంబయి ఇండియన్స్...
రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, హార్ధిక్ పాండ్య, పొలార్డ్, బెన్ కట్టింగ్, రాహుల్ చాహర్, మయాంక్ మార్కండే, మలింగ, బుమ్రా