ETV Bharat / sports

'ధోనీ కెప్టెన్సీ వల్లే చెన్నై జట్టు ఇలా ఉంది' - latest cricket news

ఐపీఎల్ ధోనీ సారథ్యం వల్లే చెన్నై సూపర్​ కింగ్స్ టాప్ ఫ్రాంఛైజీగా కొనసాగుతుందని అన్నాడు బ్యాట్స్​మన్ సురేశ్ రైనా. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, పలు విజయాల్లో పాలుపంచుకున్నారు.

Raina hails Dhoni's leadership, says it helped CSK become most decorated team in IPL
ధోని
author img

By

Published : Apr 15, 2020, 11:43 AM IST

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీపై ప్రశంసలు కురిపించాడు సీనియర్ క్రికెటర్ సురేశ్​ రైనా. అతడి కెప్టెన్సీ వల్లే చెన్నై సూపర్​కింగ్స్​.. ఐపీఎల్​ చరిత్రలో టాప్ ఫ్రాంఛైజీగా మారిందని అన్నాడు. సారథిగా అతడు జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడాడు.

"వికెట్ల వెనకుండి ధోనీ మ్యాచ్​ను ఆసాంతం నడిపిస్తాడు. ఏ పరిస్థితుల్లో ఎవరితో బౌలింగ్ చేయించాలో అతడికి బాగా తెలుసు" -సురేశ్​ రైనా, టీమిండియా సీనియర్ క్రికెటర్​

2008లో ఐపీఎల్​ మొదలైనప్పటి నుంచి చెన్నైకు ధోనీ కెప్టెన్సీ వహిస్తున్నాడు. అన్ని సీజన్లలో ఫ్లే ఆఫ్స్​కు అర్హత సాధించిన ఈ జట్టు.. మూడుసార్లు విజేతగా నిలిచింది. ఐదుసార్లు రన్నరప్స్​గా ఉంది.​

Raina hails Dhoni's leadership, says it helped CSK become most decorated team in IPL
వెటరన్​ బ్యాట్స్​మెన్​ సురేష్​ రైనా

33 ఏళ్ల రైనా.. సీఎస్​కే తరఫున ముఖ్యమైన బ్యాట్స్​మన్. ఐపీఎల్​లో అత్యధిక పరుగుల చేసిన వారిలో రెండోవాడు. ప్రస్తుతం ఇతడు 5, 368 పరుగులు చేశాడు. ప్రస్తుతం లాక్​డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న రైనా.. ప్రజలందరూ ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని కోరాడు.

మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్​ను, కరోనా వల్ల ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. తాజాగా లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ టోర్నీని నిరవధిక వాయిదా వేశారు.

ఇదీ చూడండి : 'ఆ విషయం నేను ధోనీ నుంచే నేర్చుకున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.