టీమ్ఇండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. అంతర్జాతీయ టీ20ల్లో మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ, ఆస్ట్రేలియాతో తొలి టీ20లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ, ఫించ్, బాబర్ అజామ్ సరసన నిలిచాడు. ఈ నలుగురు ఆటగాళ్లు 39 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం.
కాన్బెర్రా వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఆసీస్.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేయగలిగింది. దీంతో టీ20 సిరీస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఇవీ చదవండి: