ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ప్రజాదరణ కలిగిన క్రికెట్‌కు కూడా స్థానం కల్పించాలని చాలా కాలం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం మరో సారి తెరపైకి వచ్చింది. ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ను చేర్చాలన్న వాదనకు తాను మద్దతిస్తానని తెలిపాడు టీమ్ఇండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్. ఇదే కనుక జరిగితే క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డాడు.
"ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌ను చేర్చాలి. ఎందుకంటే 75 దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఇది జరిగితే ఈ ఆట చాలా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇందులో కొన్ని సవాళ్లు ఉంటాయి. మ్యాచ్‌లు రక్తి కట్టించాలంటే అనేక ఏర్పాట్లు, సదుపాయాలు అవసరం. ఐపీఎల్ విజయవంతమైందంటే నాణ్యమైన పిచ్‌లు ఉండటమే కారణం. మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంటే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు ప్రజాదరణ పొందదు? ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఒలింపిక్స్‌లో ప్రవేశించాలంటే మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నాను."
-ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
కాగా, క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడగా చేసేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2018లో ఐసీసీ సర్వే నిర్వహించగా, 87 శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు మద్దతు పలికారు. 2010, 2014లో ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చినా బీసీసీఐ మాత్రం టీమ్ఇండియాను పంపలేదు.
ఇదీ చూడండి :