ETV Bharat / sports

'కోహ్లీ, రహానె దారులు వేరైనా.. లక్ష్యం ఒక్కటే' - సచిన్​ తెందుల్కర్​ వార్తలు

కోహ్లీ, రహానెల ఆలోచన తీరు వేర్వేరు అని సచిన్​ అన్నాడు. విరాట్​తో పోల్చితే కెప్టెన్​గా రహానెకు విభిన్న శైలి ఉందని అభిప్రాయపడ్డాడు. మైదానంలో వీరిద్దరి ప్రవర్తన వేరైనా సరే లక్ష్యం మాత్రం జట్టును గెలిపించడమేనని సచిన్ తెలిపాడు.

Rahane is cool but aggressive; he'll be an able stand-in captain: Tendulkar
'కోహ్లీ, రహానె దారులు వేరైనా.. లక్ష్యం ఒక్కటే!'
author img

By

Published : Dec 24, 2020, 6:26 PM IST

టీమ్​ఇండియా టెస్టు తాత్కాలిక కెప్టెన్ రహానె ప్రశాంత స్వభావం కలిగిన వాడని దిగ్గజ సచిన్ అన్నాడు. తనదైన వ్యూహాలతో భారత జట్టుకు విజయాన్ని అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ, రహానె మైదానంలో ప్రవర్తించే తీరు వేరైనా, వారిద్దరి లక్ష్యం మాత్రం గెలుపేనని మాస్టర్ చెప్పాడు.

"రహానె ఇంతకు ముందే టీమ్​ఇండియాకు కెప్టెన్​గా చేశాడు. ప్రశాంతమైన మనస్తత్వం.. అలా అని అతడిలో దూకుడుగా ఆడేతత్వం లేదనుకోకూడదు. ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన దూకుడుగా లేనట్లు కాదు. ఉదాహరణకు పుజారాను తీసుకుంటే అతడు మైదానంలో ఏకాగ్రతతో చాలా కూల్​గా ఆడతాడు. దాని అర్ధం పుజారా మిగిలిన ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆడాలని ప్రయత్నించడకపోవడం కాదు. ప్రతి ఒక్కరూ తమదైన పరిస్థితులను బట్టి స్పందిస్తారు. దారులు వేరైనా.. వారందరి లక్ష్యం టీమ్ఇండియాను గెలిపించడమే. అలానే రహానెలో విభిన్న శైలి ఉంది. ఆటగాళ్లు ఎలా ఆడాలి? పిచ్​ స్పందన ఏంటి? బ్యాటింగ్​, బౌలింగ్ ఆర్డర్లు ఏంటి? అనే విషయాలు మేనేజ్​మెంట్ చూసుకుంటుంది"

- సచిన్​ తెందుల్కర్​, దిగ్గజ క్రికెటర్​

Rahane is cool but aggressive; he'll be an able stand-in captain: Tendulkar
అజింక్య రహానె

అజింక్య రహానె.. గతంలో టెస్టుల్లో రెండుసార్లు టీమ్ఇండియా కెప్టెన్​గా వ్యవహరించాడు. సారథిగా అతడికి 100 శాతం విజయాల్ని అందుకున్నాడు. ప్రస్తుత టెస్టు సిరీస్​లో పితృత్వ సెలవులపై కెప్టెన్​ కోహ్లీ స్వదేశానికి రానున్న కారణంగా.. అతడి స్థానంలో రహానెకు తాత్కాలిక కెప్టెన్​గా బాధ్యతలు అప్పగించారు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో టీమ్‌ఇండియా 0-1తో వెనకబడింది. తొలి మ్యాచ్​లో‌ కోహ్లీసేన చిత్తుగా ఓడిపోయింది. తొలి టెస్టు పూర్తయిన తర్వాత కోహ్లీ స్వదేశానికి బయల్దేరడం వల్ల రహానె, పుజారా లాంటి సీనియర్లపై బాధ్యత పెరిగింది. వారిప్పుడు కచ్చితంగా రాణించాల్సిన అవసరముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: ఒడిశాలో అతిపెద్ద హాకీ స్టేడియం.. ఆ ప్రపంచకప్​ కోసమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.