దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ సత్తాచాటారు. కోహ్లీ డబుల్ సెంచరీ సాధించగా, మయాంక్ సెంచరీతో మెరిశాడు. ఓవర్‌నైట్ స్కోరు 273 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన కోహ్లీసేన సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. 601 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ప్రొటీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు ప్రధాన పేసర్ రబాడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే మరోసారి అతడు నోటికి పనిచెప్పి చర్చనీయాంశంగా మారాడు.
- — Mohit Das (@MohitDa29983755) October 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— Mohit Das (@MohitDa29983755) October 11, 2019
">— Mohit Das (@MohitDa29983755) October 11, 2019
భారత ఇన్నింగ్స్‌లో రహానే, కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు బౌలర్‌ను మార్చితే బాగుంటుందని కీపర్ డికాక్ కెప్టెన్ డుప్లెసిస్‌కు సూచించాడు. ఫలితంగా రబాడాలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. డికాక్‌తో అతను వాగ్వివాదానికీ దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగగా.. అక్కడే ఉన్న డుప్లెసిస్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
రబాడాను డుప్లెసిస్ అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లగా వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చూడండి.. మళ్లీ కోచ్ అవతారం ఎత్తనున్న కుంబ్లే