పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న పంజాబ్ చివరి మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయింది. చెన్నైపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి.. ఈ సీజన్‌ను గెలుపుతో ముగించింది.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గేల్ తనశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడితే రాహుల్ మాత్రం చెన్నై బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. చెన్నైపై అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు వార్నర్ (20 బంతులు ) పేరిట ఉండేది.
వీరిద్దరి ధాటికి పంజాబ్ స్కోర్ కేవలం 9 ఓవర్లలోనే 100కు చేరింది. అనంతరం 108 పరుగుల వద్ద హర్భజన్ వరుస బంతుల్లో రాహుల్ (71, 5 సిక్సులు, 7 ఫోర్లు), గేల్ (28) లను పెవిలియన్ చేర్చాడు. మయాంక్ అగర్వాల్ (7) వెంటనే వెనుదిరిగినా నికోలస్ పూరన్ (36) కాసేపు మెరిశాడు.
చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.
-
That's that from Mohali. The @lionsdenkxip win comfortably and end their season on a winning note ✌️✌️ pic.twitter.com/u8LrF8ESR7
— IndianPremierLeague (@IPL) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Mohali. The @lionsdenkxip win comfortably and end their season on a winning note ✌️✌️ pic.twitter.com/u8LrF8ESR7
— IndianPremierLeague (@IPL) May 5, 2019That's that from Mohali. The @lionsdenkxip win comfortably and end their season on a winning note ✌️✌️ pic.twitter.com/u8LrF8ESR7
— IndianPremierLeague (@IPL) May 5, 2019
మెరిసిన రైనా, డుప్లెసిస్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. వాట్సన్ (7) విఫలమైనా.. డుప్లెసిస్, రైనా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రైనా (53) అర్ధశతకంతో ఆకట్టుకోగా డుప్లెసిస్ (96, 4 సిక్సులు, 10 ఫోర్లు) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
ఇవీ చూడండి.. రెండో అర్ధభాగం సంతృప్తినిచ్చింది: కోహ్లీ