ETV Bharat / sports

'వారిద్దరికీ అనుభవం లేకపోవచ్చు.. కానీ?'

ప్రస్తుత భారత క్రికెట్​ జట్టు ఓపెనర్లు అయిన పృథ్వీ షా-మయాంక్​లకు అనుభవం లేకపోయినా, వారు క్లాస్​ ప్లేయర్లని ప్రశంసించాడు కివీస్ బౌలర్ సౌథీ.

'వారిద్దరికీ అనుభవం లేకపోవచ్చు.. కానీ?'
పృథ్వీ షా-మయాంక్ అగర్వాల్
author img

By

Published : Feb 20, 2020, 6:31 AM IST

Updated : Mar 1, 2020, 10:09 PM IST

ఈనెల 21 నుంచి భారత్-న్యూజిలాండ్​ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన కివీస్ బౌలర్ సౌథీ.. టీమిండియా ప్రస్తుత ఓపెనర్లకు అనుభవం లేకపోయినప్పటికీ, క్లాస్​ ఆటగాళ్లని అన్నాడు. ప్రత్యర్థి బ్యాటింగ్​ ఆర్డర్​ బలంగా ఉందని చెప్పాడు.

'గాయం కారణంగా ఇద్దరు బ్యాట్స్​మెన్ భారత జట్టుకు దూరమయ్యారు. అయినా ఆ జట్టులో మంచి ప్రతిభవంతులున్నారు. అవసరమైన సమయంలో బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్​ అగర్వాల్​కు అనుభవం లేకపోవచ్చు కానీ వారిద్దరూ క్లాస్​ ప్లేయర్స్' -టిమ్ సౌథీ, కివీస్ బౌలర్

southee with his team
కివీస్​ జట్టుతో బౌలర్ సౌథీ

2018లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా.. ఇప్పటి వరకూ రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. మయాంక్ అగర్వాల్ తొమ్మిది టెస్టుల్లో పాల్గొన్నాడు. పరిమిత అనుభవమున్న వీరిద్దరూ కివీస్‌పై టెస్టు సిరీస్‌లో ఎలా ఆడతారో? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే జరిగిన వన్డే సిరీస్​లో ఈ జోడీ పరుగుల చేయడంలో దారుణంగా విఫలమైంది.

Last Updated : Mar 1, 2020, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.