ETV Bharat / sports

'ఫైనల్లో సహజంగా ఆడండి.. ఎలాంటి మార్పులు చేయొద్దు'

విజయ్​ హజారే టోర్నీ ఫైనల్​ మ్యాచ్​ ఆడనున్న ముంబయి జట్టుకు పలు సూచనలు చేశాడు టీమ్ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ముంబయి కెప్టెన్ పృథ్వీ షాతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించాలని పేర్కొన్నాడు.

Prithvi doesn't need to change anything in his approach: Shreyas Iyer ahead of Vijay Hazare finals
'ఫైనల్లో సహజంగా ఆడండి.. ఎలాంటి మార్పులు చేయొద్దు'
author img

By

Published : Mar 13, 2021, 10:04 AM IST

ముంబయి జట్టు.. విజయ్​ హజారే టోర్నీ ఫైనల్​కు చేరడంపై హర్షం వ్యక్తం చేశాడు క్రికెటర్​ శ్రేయస్ అయ్యర్. ఉత్తర్​ప్రదేశ్​తో మార్చి14న జరగనున్న తుది పోరులో.. జట్టులో ఎటువంటి మార్పులు చేయొద్దని ముంబయి కెప్టెన్ పృథ్వీ షాకు సూచించాడు. తమ సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించాలని తెలిపాడు.

తొలుత ముంబయి జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన శ్రేయస్​.. ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్​కు ఎంపికయ్యాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్​గా పృథ్వీ షాను నియమించారు. కెరీర్​లోనే అత్యుత్తమ ఫామ్​లో ఉన్న పృథ్వీ.. ప్రస్తుతం టోర్నీ టాప్​ స్కోరర్​గా కొనసాగుతున్నాడు. జట్టును ఫైనల్​ చేర్చాడు.

నేనైతే ఒత్తిడికి లోను కాలేదు..

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో అర్థ సెంచరీతో రాణించాడు శ్రేయస్ అయ్యర్. ఆ మ్యాచ్​లో స్వేచ్ఛగా, సంతోషంగా ఆడినట్లు తెలిపాడు. తన ఆటను చాలా ఎంజాయ్​ చేసినట్లు పేర్కొన్నాడు. ఒత్తిడికి లోను కాలేదని అభిప్రాయపడ్డాడు.

"ఐపీఎల్​లో ఇలాంటి పరిస్థితులను చాలా సార్లు ఎదుర్కొన్నాను. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఆట చివరి వరకు క్రీజులో ఉండాలని అనుకున్నా. ఏదేమైనా ఇంగ్లాండ్​ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి ప్రణాళికను పక్కాగా అమలు చేశారు."

-శ్రేయస్ అయ్యర్, టీమ్​ఇండియా క్రికెటర్.

ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 14న జరగనుంది.

ఇదీ చదవండి: కోహ్లీ ఔట్​ను ఉత్తరాఖండ్​ పోలీసులు ఎలా వాడుకున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.