ETV Bharat / sports

'మన్కడింగ్ చేయొద్దని అశ్విన్​కు గట్టిగా చెబుతా'

author img

By

Published : Aug 20, 2020, 9:18 AM IST

వచ్చే ఐపీఎల్​లో అశ్విన్​ మన్కడింగ్ చేసేందుకు ఒప్పుకోనని స్పష్టం చేశాడు దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్. అలా చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలిపాడు.

పాంటింగ్, అశ్విన్
పాంటింగ్, అశ్విన్

వచ్చే ఐపీఎల్‌లో మన్కడింగ్‌ చేసేందుకు అశ్విన్‌కు అనుమతించనని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. మన్కడింగ్‌ ఔట్‌ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని చెప్పాడు. గత ఐపీఎల్‌లో అశ్విన్‌ రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేయడంపై వివాదం చెలరేగింది. అశ్విన్‌ ఈ ఏడాది దిల్లీకి ఆడుతున్నాడు.

పాంటింగ్, అశ్విన్
పాంటింగ్, అశ్విన్

"మన్కడింగ్‌కు సంబంధించి నేను అశ్విన్‌తో మాట్లాడతా. నేను మొదట చేసే పని అదే. అతడితో చర్చ తీవ్రంగానే ఉంటుంది. తాను నిబంధనల ప్రకారమే చేశానని, తాను చేసింది సరైందేనని చెబుతాడేమో. గత ఐపీఎల్‌ అప్పుడే మా జట్టు సభ్యులతో అలా చేయొద్దని చెప్పా. మన్కడింగ్‌ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దిల్లీ క్యాపిటల్స్‌ అది కోరుకోవట్లేదు" అని పాంటింగ్‌ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.