ETV Bharat / sports

ముంబయి శిబిరంలో పొ'లార్డ్​'.. ఉత్సాహంలో ఫ్రాంచైజీ

కరీబియన్ ప్రీమియర్ లీగ్​ ముగియడం వల్ల అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఐపీఎల్​ జట్లలో చేరుతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, రూథర్​ఫర్డ్ జట్టుతో కలిశారు.

Pollard and other CPL bound players check in for respective franchises
ముంబయి శిబిరంలో పొ'లార్డ్​'
author img

By

Published : Sep 13, 2020, 5:22 AM IST

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగియడం వల్ల అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఐపీఎల్‌ జట్లలో చేరుతున్నారు. స్టార్‌ ఆటగాడు కీరన్ పొలార్డ్‌ శనివారం ముంబయి ఇండియన్స్‌తో కలిశాడు. అతడితో పాటు షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ కూడా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంచైజీ వెల్లడించింది.

ఈ నెల 10న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ జరిగింది. సెయింట్‌ లూసియా జౌక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రింబాగో నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు సారథి కీరన్‌ పొలార్డ్‌ అబుదాబికి చేరుకున్నాడు.

"పొలార్డ్‌ కుటుంబం, రూథర్‌ఫర్డ్‌ కరీబియన్‌ దీవుల నుంచి అబుదాబికి చేరుకొని ముంబయి ఇండియన్స్‌ కుటుంబంతో కలిశారు" అని ముంబయి తెలిపింది. రాయల్‌ ఛాలెంజర్స్‌కు మినహా మిగతా అన్ని జట్లలో సీపీఎల్ ఆటగాళ్లు ఉన్నారు.

డ్వేన్‌ బ్రావో, మిచెల్‌ శాంట్నర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, క్రిస్‌లిన్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రసెల్‌, హెట్‌మైయిర్‌, సందీప్‌ లామిచాన్‌, కీమో పాల్‌, కాట్రెల్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, నికోలస్‌ పూరన్‌, ఓషాన్‌ థామస్‌ లీగ్‌లో రాణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.