ETV Bharat / sports

'మన్​ కీ బాత్'​: మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు - Mann ki Baat latest episode

ఈ ఏడాది జరిగిన మూడో 'మన్​ కీ బాత్'లో భారత మహిళ క్రీడాకారులను మెచ్చుకున్నారు. మిథాలీ రాజ్, పీవీ సింధులను అభినందించారు.

PM Modi lauds sports icons Mithali Raj, Sindhu in Mann ki Baat
'మన్​ కీ బాత్'​: మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు
author img

By

Published : Mar 28, 2021, 11:53 AM IST

ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రపంచకప్​లో అదరగొట్టిన మహిళ షూటర్లపై ప్రశంసలు కురిపించారు.

"మార్చిలో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నాం. ఇదే నెలలో ఎందరో మహిళా క్రీడాకారులు పలు రికార్డులు సృష్టించడం సహా పతకాలనూ సాధించారు. ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్​ ప్రపంచకప్​లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. స్వర్ణాలు ఎక్కువగా సొంతం చేసుకుంది" అని ప్రధాని మోదీ వెల్లడించారు.

PM Modi lauds sports icons
మోదీ 'మన్​ కీ బాత్'​

ఇటీవల వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్​గా మిథాలీ రాజ్ నిలిచింది. ఆమె ఆ ఘనత సాధించినందుకు మోదీ అభినందనలు తెలిపారు. స్విస్ ఓపెన్​లో సత్తాచాటిన షట్లర్ పీవీ సింధు రజతం గెల్చుకున్నవిషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.