భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టులో.. శతకం నమోదు చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 59 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన కోహ్లీ... 159 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో 27వ సెంచరీ. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ శతకం. ఇందులో 43 వన్డే సెంచరీలు ఉన్నాయి.
-
20th Test century as Captain of India ✅
— BCCI (@BCCI) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
27th Test century of his career ✅
70th International century ✅
41st international century as captain (joint-most)✅
1st Indian to hit a century in day/night Test ✅#KingKohli pic.twitter.com/q01OKPauOu
">20th Test century as Captain of India ✅
— BCCI (@BCCI) November 23, 2019
27th Test century of his career ✅
70th International century ✅
41st international century as captain (joint-most)✅
1st Indian to hit a century in day/night Test ✅#KingKohli pic.twitter.com/q01OKPauOu20th Test century as Captain of India ✅
— BCCI (@BCCI) November 23, 2019
27th Test century of his career ✅
70th International century ✅
41st international century as captain (joint-most)✅
1st Indian to hit a century in day/night Test ✅#KingKohli pic.twitter.com/q01OKPauOu
సచిన్ రికార్డుపై కన్ను...
తాజాగా 27వ టెస్టు సెంచరీ ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. వేగంగా ఈ రికార్డును అందుకున్న రెండో ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. 141 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు విరాట్. బ్రాడ్‌మన్ 70 ఇన్నింగ్స్‌ల్లోనే 27 సెంచరీలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. 31 ఏళ్ల కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 70 సెంచరీలు చేసిన (439 ఇన్నింగ్స్‌ల్లో) తొలి బ్యాట్స్‌మన్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. సచిన్ 505 ఇన్నింగ్స్‌లు, ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 649 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు అందుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
గులాబీను వదల్లేదు...
దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రికార్డులను అందుకునే దిశగా పయనిస్తున్న కోహ్లీ... భారత్‌లో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులోనూ శతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.
- టీమిండియా సారథిగా 20వ టెస్టు సెంచరీ
తొలి రోజు ఆటలోనూ అర్ధశతకం సాధించి...టెస్టు కెప్టెన్‌గా అతి తక్కువ (86) ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని సాధించాడు కోహ్లీ. ఇదే ఘనతను ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్(97 ఇన్నింగ్స్), విండీస్ మాజీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్(106 ఇన్నింగ్స్), దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్(110), ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్(116), న్యూజిలాండ్ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్(130) ఇన్నింగ్స్‌ల్లో సాధించారు.