ETV Bharat / sports

పింక్​ టెస్టులో రెండో రోజు రికార్డులు ఇవే... - virat kohli record

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్​తో జరుగుతోన్న డేనైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్​ను​ 32.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగుల వద్ద ముగించింది బంగ్లాదేశ్​. ప్రస్తుతం 89 పరుగుల వెనుకంజలో ఉండగా.. ఆ జట్టు ఆటగాడు ముష్ఫికర్​ అర్థశతకంతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్​లో అంతకుముందు కోహ్లీ శతకంతో రాణించాడు. వీటితో పాటు మరికొన్ని రికార్డులు మీకోసం..

పింక్​ టెస్టులో రెండో రోజు రికార్డులు ఇవే...
author img

By

Published : Nov 24, 2019, 5:56 AM IST

కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టులో.. భారత ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్​ను 347/9 వద్ద డిక్లేర్ చేసిన కోహ్లీసేన.. బంగ్లాదేశ్​ను రెండో ఇన్నింగ్స్​లోనూ కట్టడి చేసింది. 32.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది బంగ్లా. ప్రస్తుతం 89 పరుగుల వెనుకంజలో ఉండగా.. ముష్ఫికర్​ రహీమ్​ అర్ధశతకంతో నాటౌట్​గా కొనసాగుతున్నాడు.

కోహ్లీ అదరహొ...

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 174/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా... దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే(51; 69 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకి ఇది 22వ అర్ధ శతకం. అనంతరం రహానే(51) తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫలితంగా కోహ్లీ, రహానే 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తైజుల్‌ ఇస్లామ్‌ వేసిన 68 ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీసిన విరాట్​... 159 బంతుల్లో 12 ఫోర్లు సాయంతో సెంచరీ సాధించాడు.

  • 20th Test century as Captain of India ✅
    27th Test century of his career ✅
    70th International century ✅
    41st international century as captain (joint-most)✅
    1st Indian to hit a century in day/night Test ✅#KingKohli pic.twitter.com/q01OKPauOu

    — BCCI (@BCCI) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  • టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ శతకం. ఇప్పటి వరకు తెలుపు, ఎరుపు బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన కోహ్లీ పింక్‌ బాల్ టెస్టులోనూ శతకంతో చెలరేగాడు. ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి డేనైట్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

(2011లో అబుదాబి వేదికగా ఇంగ్లాండ్​ కౌంటీ ఛాంపియన్​షిప్​లో ఎమ్​సీసీ, నాటింగ్​హామ్​షైర్​ మ్యాచ్​ జరిగింది. ఇందులో పింక్​ బంతిని పరీక్షించారు. ఎమ్​సీసీ తరఫున బరిలోకి దిగిన ద్రవిడ్​ ఈ మ్యాచ్​లో శతకం చేశాడు​.)

136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌటయ్యారు.

డకౌట్ల లిస్టులో...

1. చారిత్రక గులాబి బంతి​ టెస్టులో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు బౌలర్​ ఉమేశ్​ యాదవ్​. ఈ మ్యాచ్​లో డకౌట్​ అయిన మొదటి భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు.

  • డే/నైట్​ వన్డే మ్యాచ్​లో- ఎస్​ పాటిల్​
  • డే/నైట్​ టీ20 మ్యాచ్​లో- మహేంద్ర సింగ్​ ధోనీ
  • డే/నైట్​ టెస్టు మ్యాచ్​లో- ఉమేశ్​ యాదవ్​
    pink-test-2019-india-in-driving-seat-as-bangladesh-in-crash-records-of-second-day
    ఉమేశ్​ యాదవ్​

2. డే/నైట్​ టెస్టుల్లో సెంచరీ సాధించిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు కోహ్లీ. ఈ మ్యాచ్​లో 136 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసి.. శతకం నమోదు చేశాడు. డుప్లెసిస్​(2016), స్మిత్​(2016), రూట్​(2017), కేన్​ విలియమ్సన్​(2018) ముందున్నారు.

3. గులాబి బంతి టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన కెప్టెన్​గా ఇంగ్లాండ్​ సారథి రూట్​ సరసన నిలిచాడు​ కోహ్లీ. 136 పరుగులు చేసిన విరాట్​.. రూట్​(136) పక్కన చోటు సంపాదించుకున్నాడు. 2017లో 130 పరుగులు చేసిన స్మిత్​ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

4. అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన కెప్టెన్​ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. గ్రేమ్​ స్మిత్​(దక్షిణాఫ్రికా) 25 శతకాలు చేయగా... భారత సారథి విరాట్​ (20), ఆసీస్​ మాజీ సారథి రికీ పాంటింగ్​ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

5. కెప్టెన్​గా అత్యధిక సెంచరీలు(అన్ని ఫార్మాట్లు) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విరాట్​.

  • కోహ్లీ(భారత్​) - 41*
  • పాంటిగ్​(ఆస్ట్రేలియా)- 41
  • గ్రేమ్​ స్మిత్​(దక్షిణాఫ్రికా)- 33

6. బంగ్లా బ్యాట్స్​మన్​ ముష్ఫికర్​ రహీమ్​ కెరీర్​లో మరో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. 54 బంతుల్లో 50 పరుగులు చేసిన ఇతడు... టెస్టు కెరీర్​లో 21వ హాఫ్​ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Caja Magica, Madrid, Spain. 23rd November 2019.
++SHOTLIST TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Kosmos
DURATION: 01:37
STORYLINE:
Denis Shapovalov and Vasek Pospisil gave their reactions after leading Canada to a maiden Davis Cup finals on Saturday, beating Karen Khachanov and Andrey Rublev in the doubles rubber to win the semi-final tie 2-1.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.