ETV Bharat / sports

'ఆస్ట్రేలియాతో పింక్​బాల్​ టెస్టు పెద్ద సవాల్​!' - బోర్డర్​ గావస్కర్​ టెస్టు సిరీస్​ న్యూస్​

ఆస్ట్రేలియాతో జరగనున్న పింక్​బాల్ టెస్టు పెద్ద సవాల్​ అని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా వైస్​కెప్టెన్ రోహిత్​ శర్మ. ఇటీవలె ఇన్​స్టాగ్రామ్​లో ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

Pink-ball Test in Australia 'will be challenging for sure': Team India ViceCaptain Rohit Sharma
'ఆస్ట్రేలియాతో పింక్​బాల్​ టెస్టు పెద్ద సవాలే!'
author img

By

Published : Jun 16, 2020, 6:19 PM IST

ఆసీస్​ జట్టుతో 'గులాబి టెస్టు'​ సవాలుగా ఉండబోతోందని చెప్పాడు టీమ్​ఇండియా వైస్​కెప్టెన్​ రోహిత్​ శర్మ. ఈ ఏడాది ఆఖరులో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ పర్యటన కోసం ఏ విధంగా సన్నద్ధమవుతున్నారని ఇన్​స్టాగ్రామ్​లో ఓ అభిమాని అడగిన ప్రశ్నకు రోహిత్​ శర్మ సమాధానమిచ్చాడు.

"ఆస్ట్రేలియాతో జరగనున్న పింక్​ బాల్​ టెస్టుకు మీరు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు. మీ ఆలోచనలేంటి?" అని ఓ నెటిజన్​ అడిగాడు. దానికి రోహిత్​ సమాధానమిస్తూ.."కచ్చితంగా అది పెద్ద సవాలే" అని అన్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డిసెంబరు 3 నుంచి బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​లో తలపడనుంది భారత జట్టు. అందులో డిసెంబరు 11 నుంచి జరగనున్న రెండో మ్యాచ్​.. పింక్​బాల్​తో నిర్వహించనున్నారు. ఇందుకు అడిలైడ్​ వేదిక కానుంది. అయితే విదేశాల్లో భారత్​ ఆడుతున్న తొలి గులాబి బంతి టెస్టు ఇదే.

గతేడాది నవంబరులో బంగ్లాదేశ్​తో కోల్​కతాలో జరిగిన ఏకైక పింక్​ బాల్​ టెస్టు టీమ్​ఇండియా ఆడింది. అందులో భారత జట్టు ఘనవిజయం సాధించింది.

ఓటమి లేని జట్టు..

ఇప్పటివరకు డై-నైట్​ టెస్టుల్లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్​ కూడా ఓడిపోలేదు. ఆడిన ఏడు మ్యాచ్​ల్లో ఆసీస్​ వరుస విజయాలను నమోదు చేసింది. వీటిలో బౌలర్​ మిచెల్​ స్టార్క్​.. 42 వికెట్లను పడగొట్టాడు.

బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​లోని తొలి మ్యాచ్​ డిసెంబరు 3 నుంచి గబ్బా వేదికగా జరగనుంది. ఆ తర్వాత డిసెంబరు 11 నుంచి 15 వరకు అడిలైడ్​లో పింక్​బాల్​ టెస్టు.. మెల్​బోర్న్​లో బాక్సింగ్​ డే టెస్టు.. సిడ్నీలో న్యూఇయర్​ టెస్టు జరగనున్నాయి.

ఇదీ చూడండి... ప్రపంచకప్​ తర్వాతే రిటైర్మెంట్​: హఫీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.