ETV Bharat / sports

భారత్ ఆత్మీయ దేశం: పీటర్సన్ - పీటర్సన్ భారత్

దక్షిణాఫ్రికాకు భారత్ కరోనా వ్యాక్సిన్లు పంపించడంపై హర్షం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. భారతీయుల ఉదారత, సహృదయత రోజురోజుకి ఇనుమడిస్తోందని ట్వీట్ చేశాడు.

Pietersen
పీటర్సన్
author img

By

Published : Feb 3, 2021, 1:17 PM IST

దక్షిణాఫ్రికాకు భారత్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్లు పంపించడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ హర్షం వ్యక్తం చేశాడు. భారత్ ఆత్మీయ దేశమని కొనియాడాడు. భారతీయుల ఉదారత, సహృదయత రోజురోజుకి ఇనుమడిస్తోందని ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు భారత టీకాలు చేరాయని సోమవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో పీటర్సన్‌ ట్వీట్ చేశాడు.

ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడిన పీటర్సన్‌ దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతేగాక కొత్త రకం వైరస్‌ కూడా వ్యాప్తి చెందుతోంది. కరోనా భయంతో దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా జట్టు వాయిదా వేసుకుంది. షెడ్యూలు ప్రకారం వచ్చే నెల సౌతాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ మూడు టెస్టులు ఆడాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.