ETV Bharat / sports

న్యూజిలాండ్​ పర్యటనకు 45 మందితో పాక్​ జట్టు? - New Zealand

న్యూజిలాండ్​ పర్యటన కోసం మెరుగైన ఆటగాళ్లున్న రెండు బృందాలను పంపించేందుకు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సిద్ధమవుతోంది. ఈ ఏడాది నవంబరులో ఇరుదేశాల మధ్య సిరీస్​లు జరగనున్నాయి.

PCB
పీసీబీ
author img

By

Published : Sep 10, 2020, 7:58 AM IST

ఈ ఏడాది నవంబరులో న్యూజిలాండ్​ పర్యటన కోసం ఏ బృందాన్ని పంపించాలా అని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఆలోచన చేస్తోంది. కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్ల.. దేశీయ టోర్నీల్లో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన చెందుతోంది. సుమారు 40 నుంచి 45 మంది క్రికెటర్లను కివీస్​కు పంపాలని చూస్తున్నట్లు పీసీబీ అధికారిక వర్గాలు తెలిపాయి.

"న్యూజిలాండ్​లోని కఠిన కొవిడ్​ నిబంధనలు, ప్రోటోకాల్స్​ కారణంగా రెండు బృందాల్లో మెరుగైన ఆటగాళ్లు ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నాక.. క్రీడాకారులు, అధికారులు 14 రోజుల క్వారంటైన్​లో ఉండాల్సి వస్తుంది. మ్యాచ్​లు ప్రారంభానికి ముందు బయో బబుల్​లోకి ప్రవేశిస్తారు"

-- పీసీబీ అధికారిక వర్గాలు

న్యూజిలాండ్​తో వన్డే, టీ20 సిరీస్​ల్లో సీనియర్​ జట్టు పాల్గొనుండగా.. పాకిస్థాన్​-ఏ జట్టు టెస్టు మ్యాచ్​ల్లో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.