ETV Bharat / sports

గ్రాంట్​ ఆరోపణల్లో నిజం లేదు: పీసీబీ అధికారి

author img

By

Published : Jul 3, 2020, 2:25 PM IST

Updated : Jul 3, 2020, 4:04 PM IST

యూనిస్​ ఖాన్​పై మాజీ కోచ్​ గ్రాంట్​ ఫ్లవర్​ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అధికారి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అల్పాహార సమయంలో జరిగిన సరదా సంఘటనను గ్రాంట్​ పెద్దదిగా చేసి చూపిస్తున్నాడని వెల్లడించాడు.

PCB, Pak team management decline comment on Flower's charge against Younis
గ్రాంట్​ ఆరోపణల్లో నిజం లేదు: పీసీబీ అధికారి

పాకిస్థాన్​ దిగ్గజ క్రికెటర్​ యూనిస్​ ఖాన్​పై మాజీ కోచ్​ గ్రాంట్​ ఫ్లవర్​ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు నిరాకరించింది. బ్యాటింగ్​లో సలహా ఇస్తే వినకుండా యూనిస్ తన మెడ మీద కత్తి పెట్టాడని ఆరోపించాడు గ్రాంట్​ ఫ్లవర్​. పాక్​ జాతీయ జట్టుకు 2014 నుంచి 2019 వరకు దాదాపు ఐదేళ్లపాటు కోచ్​గా పనిచేశాడు గ్రాంట్​. యూనిస్​ ఖాన్​ ప్రస్తుతం పాక్​ జట్టుకు బ్యాటింగ్​ కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలపై పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ 2016లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్​లో జరిగింది కేవలం స్నేహపూర్వక సంఘటన మాత్రమేనని ఆ బోర్డు అభిప్రాయపడుతున్నట్లు ఓ అధికారి తెలిపాడు.

"గ్రాంట్​ చెప్పింది పూర్తిగా నిజం కాదు. యూనిస్​ సరదాగా కత్తి పైకెత్తి అల్పాహార సమయంలో సలహా ఇవ్వొద్దని చెప్పిన మాటను గ్రాంట్​ సీరియస్​గా తీసుకున్నాడు. పాకిస్థాన్​ జట్టుతో కలిసి పని చేసిన మాజీ కోచ్​లు, సహాయక సిబ్బంది తమ ఒప్పందాలు ముగిసిన తర్వాత సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించడం బాధగా ఉంది. వారు వెలుగులోకి రావడానికి చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూపిస్తున్నారు".

- పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అధికారి

గ్రాంట్​ ఫ్లవర్​ ఆరోపణలపై ప్రస్తుత పాక్​ బ్యాటింగ్​ కోచ్​ యూనిస్​ ఖాన్​ స్పందించలేదు. దీనిపై ఆ దేశ క్రికెట్​ జట్టు మేనేజర్​ను సంప్రదించగా.. అతడి​ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇంగ్లాండ్​ పర్యటన కోసం బ్యాటింగ్​ కోచ్​గా ఉండటానికి యూనిస్​ ఖాన్ ఇటీవలే​ అంగీకరించాడు. టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు యూనిస్​.

ఇదీ చూడండి... 'సలహా ఇస్తే మెడ మీద కత్తిపెట్టాడు'

Last Updated : Jul 3, 2020, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.