ETV Bharat / sports

ధోనీపై ముస్తాక్​ వ్యాఖ్యలు.. పాక్ బోర్డు అసంతృప్తి! - పాక్​ క్రికెట్​ బోర్డు

పాక్ క్రికెట్ బోర్డులో సభ్యులుగా ఉన్న మాజీలు, అధికారులు.. తమ సొంత యూట్యూబ్​ ఛానల్స్​లో ఇతర దేశాల క్రికెటర్ల గురించి మాట్లాడుతూ, ఎలాంటి వీడియోలు పోస్ట్​ చేయకూడదని ఆదేశించింది. అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

PCB
ధోనీ, ముష్తాక్​
author img

By

Published : Aug 26, 2020, 12:05 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ రిటైర్మెంట్ గురించి పాకిస్థాన్​ మాజీ బౌలర్ సక్లైన్​ ముస్తాక్ ఇటీవలే తన యూట్యూబ్​ ఛానెల్​లో మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెట్​ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్​ డెవలప్మెంట్​ అధ్యక్షుడిగా ఉన్న అతడు.. నిబంధనల ప్రకారం ఎలాంటి వీడియోలు పోస్ట్​ చేయకూడదని పీసీబీ గుర్తుచేసింది. ఇతడితో పాటే బోర్డులోని కోచ్​లందరూ ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది.

PCB
పీసీబీ

ఇదీ చూండండి: ధోనీ వీడ్కోలు.. బీసీసీఐ అలా చేయడమేంటి?

"ధోనీని సక్లైన్​ ప్రశంసించడం పీసీబీకి నచ్చలేదు. మహీకి సరైన వీడ్కోలు మ్యాచ్ నిర్వహించలేదని బీసీసీఐని అతడు విమర్శించాడు. కచ్చితంగా ఇది భారత క్రికెట్​ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. చాలా మంది కోచ్​లు సొంతంగా యూట్యూబ్​ ఛానల్స్​లు ఉన్నాయి. అయితే, బోర్డులో సభ్యులుగా ఉన్నంతవరకు ఇకపై వారు ఎలాంటి వీడియోలు పోస్ట్​ చేయకూడదు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే.. బోర్డు అనుమతి తీసుకోవాలి" అని బోర్డు అధికారిక వర్గాలు తెలిపాయి.

PCB
ధోనీ కెరీర్​లో సాధించిన స్కోరు

ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలోనూ ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా సరిగా లేనందున.. భారత క్రికెటర్లపై ఎలాంటి కామెంట్లు చేయకూడదని పీసీబీ తమ ఆటగాళ్లకు సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.