పాకిస్థాన్ ప్రముఖ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. బుకీలు సంప్రదించిన విషయాన్ని బోర్డుకు చెప్పని కారణంగా, నిబంధనల ప్రకారం శిక్ష ఖరారు చేశామని తెలిపింది. ఈ మేరకు పీసీబీ ట్వీట్ చేసింది.
"ఉమర్ అక్మల్‌ను క్రమశిక్షణ ప్యానెల్ ఛైర్మన్ జస్టిస్ ఫజల్ మిరాన్ (రిటైర్డ్) క్రికెట్ నుంచి మూడేళ్లు నిషేధించారు" అని పీసీబీ ట్వీట్ చేసింది.
-
Umar Akmal handed three-year ban from all cricket by Chairman of the Disciplinary Panel Mr Justice (retired) Fazal-e-Miran Chauhan.
— PCB Media (@TheRealPCBMedia) April 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Umar Akmal handed three-year ban from all cricket by Chairman of the Disciplinary Panel Mr Justice (retired) Fazal-e-Miran Chauhan.
— PCB Media (@TheRealPCBMedia) April 27, 2020Umar Akmal handed three-year ban from all cricket by Chairman of the Disciplinary Panel Mr Justice (retired) Fazal-e-Miran Chauhan.
— PCB Media (@TheRealPCBMedia) April 27, 2020
రెండు బంతులు వదిలిస్తే రెండు లక్షల డాలర్లు చెల్లిస్తామని, భారత్‌తో మ్యాచ్‌కు దూరమైతే డబ్బులు ఇస్తామని బుకీలు తనను సంప్రదించారని అక్మల్ ఓ ఇంటర్వూలో చెప్పాడు. 2015 ప్రపంచకప్ సమయంలోనూ తనతో మాట్లాడారని పేర్కొన్నాడు.
పాక్ తరఫున ఉమర్ అక్మల్.. 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. చివరిగా గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో వన్డే ఆడాడు.