అంతర్జాతీయ క్రికెట్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం(డిసెంబరు 9) ప్రకటించాడు.

17 ఏళ్ల వయసులో 2002 జనవరి 4న న్యూజిలాండ్‌పై వన్డేతో పార్థివ్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 2012 ఫిబ్రవరి 21న ఇంగ్లాండ్ వన్డే చివరగా ఆడాడు. 2002 ఆగస్టు 8న తొలి టెస్టు, 2018 జనవరి 24న చివరి టెస్టులో పాల్గొన్నాడు.
భారత్ తరఫున రెండు అంతర్జాతీయ టీ20లు, గుజరాత్ తరఫున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
పదేళ్ల కెరీర్లో 38 వన్డేలు, 25 టెస్టులాడి వరుసగా 736, 934 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు పార్థివ్.

