ETV Bharat / sports

అతడు రనౌట్​ కావడమే మ్యాచ్​లో మలుపు: సౌథీ

రిషభ్​ పంత్​ రనౌట్​ కాకపోయి ఉంటే టీమిండియాను కట్టడి చేయలేకపోయే వాళ్లమన్నాడు కివీస్ పేసర్​ టిమ్ సౌథీ. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఔట్ చేసేందుకు వాతావరణం సహకరించిందని చెప్పాడు.

author img

By

Published : Feb 22, 2020, 5:42 PM IST

Updated : Mar 2, 2020, 5:02 AM IST

Pants-run-out-was-turning-point-of-Indias-innings--Southee
అతడు రనౌట్​ అవ్వటమే మ్యాచ్​లో మలుపు: సౌథీ

వెల్లింగ్టన్ వేదికగా భారత్​-న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు జరుగుతోంది. ఇందులోని తొలి ఇన్నింగ్స్​లో రిషభ్‌పంత్‌ రనౌట్‌ కావడం వల్లే, వారిని త్వరగా ఆలౌట్‌ చేయగలిగామని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. అజింక్య రహానెతో రిషబ్​ ఆడుంటే భారీ స్కోరు చేసేవాడని అభిప్రాయపడ్డాడు. పంత్‌ ఔటైన కాసేపటికే సౌథీ బౌలింగ్‌లోనే రహానె వెనుదిరిగాడు. ఈ విషయం గురించి మాట్లాడాడు బౌలర్​ సౌథీ.

"రహానెను ఔట్‌ చేసేందుకు మేం ఎలాంటి వ్యూహం అనుసరించలేదు. ఉదయం పంత్‌ రనౌట్‌ కావడమే మ్యాచ్​లో కీలక మలుపు. లేదంటే​ తన బ్యాటింగ్​తో వేగంగా పరుగులు చేసేవాడు. రిషభ్ పెవిలియన్‌ చేరితే అజింక్య దూకుడుగా ఆడతాడని తెలుసు. అందుకే మేం కట్టుదిట్టంగా బంతులు విసిరాం. టీమిండియాను తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేశాం. ఒకప్పటిలా నేను బంతిని వేగంగా విసరడం లేదు. వేగం గురించి ఆందోళన పడట్లేదు. నా మిగతా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నా. నిన్నటిలా నేడు(శనివారం) గాలులు వేగంగా వీయకపోయినా వాతావరణం అనుకూలిస్తుండటం వల్ల బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేశాను. ప్రస్తుత మ్యాచ్​లో మేం చక్కని స్థితిలో ఉన్నాం. ఇదే జోరుతో విలువైన భాగస్వామ్యం నిర్మిస్తే రెండో ఇన్నింగ్స్‌ సులువు అవుతుంది. సాధారణంగా బేసిన్‌ రిజర్వ్‌లో రెండో రోజు బంతి తిరగడం ఇంతకుముందు చూడలేదు. అందుకే తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం అత్యంత కీలకం. ముందుగానే భారీ స్కోరు చేస్తే తర్వాత సులభం అవుతుంది. మిగతా మూడు రోజుల్లో పిచ్‌ ఎలా ఉంటుందో తెలియదు"

- టిమ్​ సౌథీ, న్యూజిలాండ్​ బౌలర్​

కివీస్​తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 165 పరుగులకే కుప్పకూలింది. రెండో రోజు, శనివారం 122/5తో ఆట ఆరంభించిన భారత్‌.. కేవలం 43 పరుగులే చేసి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 216/5తో రెండో రోజు ఆటను ముగించింది.

ఇదీ చూడండి.. 'ప్రపంచ క్రికెటర్లలో జడేజా నా రాక్​స్టార్​'​

Last Updated : Mar 2, 2020, 5:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.