రిషభ్ పంత్.. ఇటీవల పేలవ ప్రదర్శనతో సర్వత్రా విమర్శల పాలయ్యాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు స్పెషల్ కోచింగ్ ఇవ్వాలని అన్నాడు టీమిండియా ప్రధాన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. వికెట్ కీపింగ్ స్కిల్స్, బ్యాటింగ్‌లో నైపుణ్యం పెంచాలని అభిప్రాయపడ్డాడు.
"పంత్‌కు వికెట్ కీపింగ్‌లో నైపుణ్యం మరింత అవసరం. ఇందుకోసం ఓ స్పెషలిస్టు కోచ్‌ను నియమించేలా ఏర్పాట్లు చేస్తున్నాం" - ఎమ్మెస్కే ప్రసాద్, ప్రధాన సెలక్టర్
వరుసగా విఫలమవుతున్నా.. వికెట్ కీపింగ్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నా రిషభ్ పంత్‌కు జట్టు యాజమాన్యం నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఇటీవల జరిగిన బంగ్లా, విండీస్‌తో టీ20 సిరీస్‌లే ఇందుకు ఉదాహరణ. ఆ సిరీస్‌ల్లో బ్యాకప్ కీపర్‌గా 15 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్ ఉన్నప్పటికీ అతడికి ఒక్క అవకాశమూ ఇవ్వకుండా యాజమాన్యం పంత్ వైపే మొగ్గు చూపింది.
ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఫిలాండర్ గుడ్ బై