న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో పాకిస్థాన్ జట్టు తడబడుతూ ఆడుతుంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ల ఆటతీరుపై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాఠశాల స్థాయి ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేశారంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆగ్రహం వ్యక్తం చేశాడు.
-
Clubs teams would play better than this. pic.twitter.com/r9m4ekqbeq
— Shoaib Akhtar (@shoaib100mph) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Clubs teams would play better than this. pic.twitter.com/r9m4ekqbeq
— Shoaib Akhtar (@shoaib100mph) January 5, 2021Clubs teams would play better than this. pic.twitter.com/r9m4ekqbeq
— Shoaib Akhtar (@shoaib100mph) January 5, 2021
"పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విధానాలేంటో వారు ఎంచుకున్న జట్టును చూస్తే అర్థమవుతుంది. జట్టులో బలహీనమైన ఆటగాళ్లను తీసుకున్నారు. వారి ప్రదర్శన కూడా బలహీనంగా ఉండగా.. మ్యాచ్ ఫలితాలూ అదే రకంగా వస్తున్నాయి. ఇటీవల జట్ల ఎంపికను గమనిస్తే.. అది పాఠశాల స్థాయి ఆటగాళ్లతో జట్టును కూర్పు చేశారా? అనే అనుమానం కలుగుతుంది. జట్టు యాజమాన్యం ఎప్పుడు మారుతుందా? అని అంటున్నారు. కానీ, మీరు ఎప్పుడూ మారతారు".
- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్
పాకిస్థాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (238) డబుల్ సెంచరీతో అలరించగా.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టు 659 రన్స్ చేసి డిక్లేర్డ్ ప్రకటించింది. ఫలితంగా మూడో రోజు ముగిసే సమయానికి 362 పరుగుల ఆధిక్యంలో ఆతిథ్య జట్టు ఉంది. కివీస్ బ్యాట్స్‌మన్ నికోలస్ (157), మిచెల్ (102*) అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీ చేసి ఆకట్టుకున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోన్న పాక్.. వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. మూడో రోజు ముగిసే సమయానికి 354 పరుగులతో కివీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. పాకిస్థాన్‌తో ఆడిన బాక్సింగ్‌డే టెస్టులో 101 రన్స్‌తో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది.