ETV Bharat / sports

పాకిస్థాన్ పేసర్ ఆమిర్ రిటైర్మెంట్

author img

By

Published : Dec 17, 2020, 3:23 PM IST

Updated : Dec 17, 2020, 4:13 PM IST

న్యూజిలాండ్​ పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డుపై ఆ దేశ క్రికెటర్​ మహ్మద్​ ఆమిర్​ నిరాశ చెందాడు. తనను విస్మరించడం పట్ల స్పందించిన ఆమిర్​.. క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

Pakistan pacer Mohammad Amir takes indefinite break from international cricket
క్రికెట్​కు మొహమ్మద్​ ఆమిర్​ నిరవధిక విరామం

పాకిస్థాన్​ పేసర్​ మహ్మద్​ ఆమిర్​.. అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని పీసీబీ ధృవీకరించింది. న్యూజిలాండ్ పర్యటనకు తనను జట్టులోకి తీసుకోలేదనే కారణంతో ఆమిర్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్​ క్రికెట్​ బోర్డుపై అసహనాన్ని వ్యక్తం చేశాడు.

"ప్రస్తుత పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డుతో నేను కొనసాగలేను. మెంటల్ టార్చర్ ​ కారణంగా క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. నాకు ఇదొక మేలుకొలుపు వంటిది. వాళ్ల ప్రణాళికలలో నేను భాగం కాదలచుకోలేదు. అందుకే పక్కకు తప్పుకుందామని అనుకున్నా".

- ఆమిర్​, పాకిస్థాన్​ క్రికెటర్​

పాకిస్థాన్​ జట్టు హెడ్​ కోచ్​ మిస్బావుల్​ హక్​, బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​లపై ఆమిర్ విమర్శలకు దిగాడు. ప్రస్తుత జట్టు యాజమాన్యం కివీస్​ పర్యటనకు తనను విస్మరించిన కారణంగా క్రికెట్​కు వీడ్కోలు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. గతేడాది టెస్టు ఫార్మాట్​ నుంచి తప్పుకున్నాడు ఆమిర్.

ఇదీ చూడండి: నటాషాతో 'డిన్నర్​ డేట్'కు హార్దిక్​ పాండ్యా​

Last Updated : Dec 17, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.