ETV Bharat / sports

'పాక్​లో టీమ్ ​ఇండియా ఆడుతుందని ఆశ' - టీమ్​ఇండియా

ఆసియాకప్​లో టీమ్​ఇండియాకు ఆతిథ్యమివ్వడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊవిళ్లూరుతోంది. 2023 నాటికల్లా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడి, తమ దేశానికి భారత్​ వస్తుందని ఆశిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి చెప్పారు.

Pakistan optimistic about hosting India in 2023 Asia Cup, says PCB chief Ehsan Mani
'పాక్​లో టీమ్​ఇండియా ఆడుతుందని ఆశిస్తున్నా'
author img

By

Published : Mar 18, 2021, 4:51 PM IST

2023లో పాకిస్థాన్​లో జరగబోయే ఆసియా కప్​లో భారత్​కు ఆతిథ్యమిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ ఎహ్సాన్ మణి. అప్పటికల్లా ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు మెరుగవుతాయని నమ్ముతున్నట్లు చెప్పారు.

"2022లో ఆసియా కప్​ను శ్రీలంక నిర్వహిస్తుంది. 2023లో పాకిస్థాన్​ ఆతిథ్యమిస్తుంది. అప్పటిలోగా భారత్-పాక్ మధ్య రాజకీయ సంబంధాలు మెరుగై, టీమ్​ఇండియా పాకిస్థాన్​ రావడానికి మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నా."

-ఎహ్సాన్ మణి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్

భారత్​ తమ దేశానికి వస్తే పాకిస్థాన్​ క్రికెట్​కు చాలా మేలు జరుగుతుందని మణి అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఏడాది జూన్​లో జరగాల్సిన ఆసియా కప్​ 2021 జరిగే పరిస్థితి లేదని అన్నారు. పీఎస్​ఎల్​తో పాకిస్థాన్ బిజీగా ఉంటే.. జూన్​లో ఇంగ్లాండ్​లో న్యూజిలాండ్​తో జరగబోయే ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో భారత్​ తలపడనుందని చెప్పారు. ఇక ఈ ఏడాది భారత్​లో జరిగే టీ20 ప్రపంచకప్​లో పాక్ పాల్గొనడంపై ఐసీసీ భరోసా ఇచ్చిందని మణి తెలిపారు.

ఇదీ చూడండి: డబ్ల్యూటీసీలో భారత్​ ఫైనల్​ చేరితే ఆసియా కప్​ వాయిదా!

ఇదీ చూడండి: ఆసియా కప్ ఆతిథ్యం వదులుకుంటాం: పీసీబీ

ఇదీ చూడండి: 'మా మనుగడకు భారత్​ సాయం అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.