ETV Bharat / sports

'ఇంగ్లాండ్ జట్టు​ ఇప్పటికీ బలంగానే ఉంది'

వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో గెలవకపోయినంత మాత్రాన ఇంగ్లాండ్​ జట్టు బలహీనపడినట్లు కాదని పాకిస్థాన్​ జట్టు ఓపెనర్​ షాన్​ మసూద్​ తెలిపాడు. కరోనా వ్యాప్తి అనంతరం జరిగిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్​ ఇదే కావడం విశేషం.

Pakistan opener Masood says England still a strong side despite defeat to West Indies
షాన్​ మసూద్​
author img

By

Published : Jul 15, 2020, 6:41 PM IST

వెస్టిండీస్​ జట్టుతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్​ ఓటమి పాలవడంపై పాకిస్థాన్​ ఓపెనర్​ షాన్​ మసూద్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఒక మ్యాచ్​లో ఓడిపోయినంత మాత్రాన ఇంగ్లీష్ జట్టు బలహీనమైందని కాదని పేర్కొన్నాడు. సౌతాంప్టన్​లో నిర్వహించిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్​ నాలుగు వికెట్ల తేడాతో విండీస్​ చేతిలో ఓటమి చవిచూసింది. కరోనా వైరస్​ కాలంలో జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​ ఇదే.

Pakistan opener Masood says England still a strong side despite defeat to West Indies
షాన్​ మసూద్​

"దాదాపు మూడు నెలల తర్వాత ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్​. ఇందులో ఆతిథ్య జట్టు ఓటమిని అందరూ తప్పుబట్టడం స్పష్టంగా కనపడుతోంది. అయితే, ఇంగ్లీష్​ జట్టు చాలా బలంగా ఉందని నేను భావిస్తున్నా. జో రూట్​ కెప్టెన్​గా తిరిగి వచ్చాగా.. బ్యాటింగ్​ మరింత స్థిరంగా కనిపిస్తోంది."

-షాన్​ మసూద్​, పాకిస్థాన్​ క్రికెటర్​

ఇంగ్లాండ్​ను బలహీనమైన జట్టుగా పరిగణించడం పొరపాటని అన్నాడు మసూద్​. జట్టులో ఆర్చర్​ ఒక్కడే బలమైన బౌలర్​ కాదని.. మిగిలన వారు కూడా గట్టి పోటీనిస్తారని వెల్లడించాడు. అయితే, ఇంగ్లాండ్​ను ఓడించగలిగే సామర్థ్యం పాకిస్థాన్​కు ఉందని తెలిపాడు.

ఈ ఏడాది ఆగస్టు 5న ఇంగ్లాండ్​, పాక్​ జట్ల మధ్య మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాకిస్థాన్​ ఆటగాళ్లు ఇంగ్లాడ్​లో క్వారంటైన్​లో ఉన్నారు.

ఇదీ చూడండి:దాదా, మహీలో ప్రధాన తేడా ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.