బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే టీమిండియాతో తొలి పింక్ బాల్ టెస్టు ఆడించిన దాదా తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో పాటు మరో ఉత్తమ జట్టును భాగం చేసుకొని సూపర్ సిరీస్ నిర్వహించాలని చూస్తున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపాడు. ఇదిలా ఉండగా గంగూలీ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రతిపాదన విఫలమౌతుందని పాక్ మాజీ క్రికెటర్ రషిద్ లతీఫ్ జోస్యం చెప్పాడు.
"ఇలాంటి సూపర్ సిరీస్ ఆడాలని చూస్తే.. ఆ నాలుగు జట్లు ఇతర సభ్యత్వ దేశాలను విస్మరించాలని అనుకుంటున్నాయి. ఇది ఏ మాత్రం మంచిది కాదు. అలాగే కొన్నేళ్ల క్రితం ప్రవేశపెట్టి విఫలమైన బిగ్ త్రీ మోడల్ లాగే ఈ సూపర్ సిరీస్ కూడా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అనుకుంటున్నా"
-రషిద్ లతీఫ్, పాక్ మాజీ క్రికెటర్
ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యంపై ఇంగ్లాండ్ ఇతర ఐసీసీ జట్లతో చర్చిచిస్తామని చెప్పింది. ఆస్ట్రేలియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇవీ చూడండి.. 'బీసీసీఐ ప్రపోజల్‌పై ఇతర జట్లతో చర్చిస్తాం'