ETV Bharat / sports

సచిన్ వ్యక్తిత్వం ప్రత్యేకం: పాక్ మాజీ కెప్టెన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​పై ప్రశంసలు కురిపించాడు పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. అతడో ప్రియమైన ప్రత్యర్థని చెప్పాడు. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నపుడు ఔట్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని తెలిపాడు.

సచిన్
సచిన్
author img

By

Published : May 14, 2020, 12:21 PM IST

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎప్పుడూ పండగే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌ భారత క్రికెట్‌లో మాస్టర్‌ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న తరుణంలో ఇరు దేశాల మధ్య అనేక మ్యాచ్‌లు జరిగాయి. 2003 ప్రపంచకప్‌లో మ్యాచ్‌తో సహా పాక్‌ మీద ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ సచిన్‌ సొంతం. చాలా మ్యాచుల్లో పాక్‌ ఓటమికి కారకుడైనప్పటికీ అతడే తన ప్రియమైన ప్రత్యర్థి అని చెప్పుకొచ్చాడు ఆ దేశ మాజీ కెప్టెన్‌ రషీద్ లతీఫ్. సచిన్ బ్యాటింగ్ చేసేప్పుడు ఔట్ అవ్వాలని తన మనసు ఎప్పుడూ కోరుకోలేదని యూట్యూబ్ వీడియో ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు.

"నేను వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేవారు. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం అతడు ఔట్ అవ్వాలని నా మనసు ఎప్పుడూ కోరుకోలేదు. నేను కీపింగ్ చేసేప్పుడు కూడా అతడి బ్యాటింగ్‌ను ఇష్టంగా చూసేవాడిని. టీవీలో కంటే నేను స్టంప్స్‌ వెనక నిలబడి ఉన్నప్పుడే ఎక్కువ ఆస్వాదించేవాడిని. సచిన్ స్థానంలో బ్రియన్ లారా, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఉంటే నా కీపింగ్‌లో వారిని ఔట్ చేయాలనే కోరుకుంటాను. తెందూల్కర్ వ్యక్తిత్వం మాత్రం ప్రత్యేకమైంది. నేను వెనక నుంచి ఏదైనా చెప్పినా నవ్వే అతడి సమాధానంగా ఉండేది."

-లతీఫ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్

అయితే సచిన్, మహ్మద్ అజారుద్దీన్‌ మాత్రమే ఇలా ఉంటారని అన్నాడు లతీఫ్. సచిన్‌ సెంచరీలు చేసినా, బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నా ఒక్క పదం కూడా మాట్లాడడని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.