ETV Bharat / sports

'ఐపీఎల్​ కోసం ఆసియాకప్​ వాయిదా వేస్తే సహించం' - ఆసియాకప్​ వాయిదాపై పాక్​ స్పందన

ఐపీఎల్​ నిర్వహణ కోసం ఆసియాకప్​ వాయిదా వేస్తే సహించేది లేదని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. ఒక్క దేశం కోసం టోర్నీ వాయిదా వేయడం అనైతికమని అసహనం వ్యక్తం చేసింది. ఆసియాకప్​ యథావిధిగా నిర్వహించాలని డిమాండ్​ చేసింది.

Pakistan Cricket Board Won't Accept Change Of Asia Cup Schedule To Accommodate IPL: CEO PCB
ఐపీఎల్​ కోసం ఆసియాకప్​ వాయిదా వేస్తే సహించం
author img

By

Published : Apr 24, 2020, 4:24 PM IST

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు మరోసారి విషం కక్కింది. ఐపీఎల్​ నిర్వహణ కారణంగా ఆసియా కప్​ను వాయిదా వేయడానికి పూర్తి వ్యతిరేకమని తాజా ప్రకటన ద్వారా తెలియజేసింది. భారత్​లో కరోనా లాక్​డౌన్​ కారణంగా ఐపీఎల్​ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-అక్టోబర్​లో ఐపీఎల్​ నిర్వహించాలనే పరిశీలన జరుగుతుందని పాక్​ పేర్కొంది. అయితే దీనికి సంబంధించి అంతర్జాతీయ టోర్నీల్లో ఎలాంటి మార్పు జరిగినా అంగీకరించమని ఆ దేశ బోర్డు తాజాగా వెల్లడించింది.

"మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఆసియాకప్​ను సెప్టెంబరులో నిర్వహించాలని ఐసీసీ ప్రణాళిక చేసింది. ఈ టోర్నీ పాకిస్థాన్​లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల దుబాయ్​లో జరుగుతుంది. కానీ, ఐపీఎల్​ కోసం ఈ టోర్నీని వాయిదా వేయడానికి మేము పూర్తి వ్యతిరేకం. ఐపీఎల్​ నిర్వహించడానికి ఆసియాకప్​ను నవంబర్-డిసెంబర్​కు వాయిదా వేస్తారని మాకు సమాచారం అందుతోంది. అయితే దీన్ని మేము సహించం. ఒక్క దేశం కోసం ఆసియాకప్​ ప్రణాళికను మార్చటం దారుణం. దానికి మా సహకారం లభించదు."

--వసీం ఖాన్​, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సీఈఓ

ఐపీఎల్​ కారణంగా మరే ఇతర ప్రధాన టోర్నీలకు ఆటంకం కలగకుండా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ఆసియాకప్​ ముగిసిన తర్వాతే ఐపీఎల్​ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్​ కోసం ఆసియాకప్​ను వాయిదా వేయాలనే ప్రతిపాదన ఇప్పటివరకు రాలేదు. కరోనా లాక్​డౌన్​ కారణంగా ఈ లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఫ్రాంఛైజీలు తీవ్రంగా నష్టపోతాయని వైరస్​ ప్రభావం తగ్గిన వెంటనే టోర్నీ నిర్వహణకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది.

ఇదీ చూడండి.. 'సచిన్.. మరెన్నో తరాలకు మీరు స్ఫూర్తిగా నిలవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.