పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది. ఫలితంగా పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు దూరం
గతంలో లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగిన ఫిట్‌నెస్ పరీక్షలో అక్మల్ విఫలమైనట్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు అధికారులు. అక్కడి సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపించారు. గతేడాది ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టీ20లో చివరిసారిగా ఆడాడీ క్రికెటర్. ఇప్పటివరకు 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20ల్లో పాక్ తరఫున పాల్గొన్నాడు.
ఇటీవలే ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇతడు ఆడాల్సి ఉంది. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగాల్సింది. అయితే సరిగ్గా తొలిమ్యాచ్‌కు కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం ప్రకటించింది పాక్ బోర్డు. ఫలితంగా ఈ లీగ్‌లో ఇతడికి చుక్కెదురైంది.
ఇదీ చూడండి...