స్పిన్నర్లు నౌమన్ అలీ, యాసిర్ షా మెరుపులతో తొలి టెస్టును దక్కించుకుంది పాకిస్థాన్. 7 వికెట్ల తేడా శుక్రవారం ఆ జట్టు సౌత్ఆఫ్రికాను ఓడించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది పాక్.
మరో స్పిన్నర్ యాసిర్ షాతో కలిసి రెండో ఇన్నింగ్స్లో సఫారీ జట్టును 245కే కట్టిడి చేశాడు నౌమన్. 88 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 3 వికెట్లు కోల్పోయి అవలీలగా మ్యాచ్ను దక్కించుకుంది.
సౌత్ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్: 220
పాక్ తొలి ఇన్నింగ్స్: 378
సౌత్ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్: 245
పాక్ రెండో ఇన్నింగ్స్: 90/3
నౌమన్ అదరహో..
34 ఏళ్ల వయసులో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు నౌమన్. తొలి ఇన్నింగ్స్లో కీలకమైన ఎల్గర్, డి కాక్ వికెట్లు తీసిన అతడు రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో 72 సంవత్సరాల తర్వాత అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన లేటు వయసు క్రికెటర్గా నిలిచాడు. నౌమన్పై సహచరులు సహ మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రావల్పిండిలో రెండో టెస్టు ఫిబ్రవరి 4న ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది.
ఇదీ చూడండి: హోటల్ గదిలో చెమటలు చిందిస్తున్న విరాట్