ETV Bharat / sports

పాక్​తో​ సిరీస్​కు దక్షిణాఫ్రికా జట్టు సారిథిగా క్లాసెన్​​

పాకిస్థాన్​తో జరగబోయే టీ20సిరీస్​కు తాత్కాలిక సారథిగా ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికా క్రికెటర్​ హెన్రిచ్​ క్లాసెన్​. ఫిబ్రవరి 11-14 వరకు ఈ సిరీస్​ జరగనుంది. ఈ ఫార్మాట్​ జరగబోయే సమయంలో సారథి డికాక్​ ఆసీస్​ పర్యటన కోసం స్వదేశానికి తిరిగి వెళ్లనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

author img

By

Published : Jan 20, 2021, 11:53 AM IST

Updated : Jan 20, 2021, 12:03 PM IST

henrich
హెన్రిచ్​

పాకిస్థాన్​తో జరగబోయే టీ20 సిరీస్​కు తాత్కాలిక సారథిగా ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్​ క్లాసెన్​. అతడు​​ కెరీర్​లో తొలిసారి కెప్టెన్​గా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు తెలిపింది.

పాకిస్థాన్​తో దక్షిణాఫ్రికా​.. రెండు టెస్టులు(జనవరి 26-ఫిబ్రవరి 8), మూడు టీ20లు(ఫిబ్రవరి 11-14) ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఆసీస్​తో జరిగే సిరీస్​ కోసం సఫారీ జట్టు ముందుగా క్వారంటైన్​లో ఉండాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే ముందస్తుగానే సారథి క్వింటన్​ డికాక్​.. పాక్​తో టెస్టులు ముగియగానే అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఆసీస్​ పర్యటనకు సిద్ధమౌతాడు. అందుకే డికాక్​కు బదులుగా టీ20లకు సారథిగా హెన్రిచ్​ ఎంపికయ్యాడు.

henrich
హెన్రిచ్​

ఇప్పటికే జనవరి 26నుంచి ప్రారంభం కానున్న సిరీస్ ​కోసం దక్షిణాఫ్రికా జట్టు పాక్​కు చేరుకుని క్వారంటైన్​లో ఉంది. వారికి చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్​గా తేలింది.

ఇదీ చూడండి : పాక్​ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టుకు కరోనా నెగెటివ్​

Last Updated : Jan 20, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.