ETV Bharat / sports

కింగ్ కోహ్లీ మొదటి శతకానికి పదేళ్లు

టీమిండియా సారథిగా ప్రపంచ క్రికెట్​లో ఓ వెలుగు వెలుగుతున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ దశాబ్దంలో మేటి బ్యాట్స్​మన్​గా ఉన్న కోహ్లీ.. వన్డే ఫార్మాట్​లో మొదటి సెంచరీ సాధించి నేటికి సరిగ్గా పదేళ్లు.

kohli
కోహ్లీ
author img

By

Published : Dec 24, 2019, 12:52 PM IST

కోహ్లీ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న పేర్లలో ఒకటి. మైదానంలోకి దిగితే సెంచరీయే అన్న విధంగా తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఈ దశాబ్దంలో మేటి బ్యాట్స్​మన్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు తొలి వన్డే సెంచరీ సాధించింది నేటికి సరిగ్గా 10 ఏళ్ల క్రితం.

శ్రీలంకతో మ్యాచ్​

అది 2009 డిసెంబర్ 24.. కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​లో శ్రీలంకతో మ్యాచ్​. మొదట బ్యాటింగ్ చేసిన లంక.. ఉపుల్ తరంగ (118) వీరవిహారంతో ఏకంగా 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గెలవాలంటే భారత్ లక్ష్యం 316. 23 పరుగులకే దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్ పెవిలియన్ బాట పట్టారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు కింగ్ కోహ్లీ. గౌతమ్ గంభీర్​తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే విరాట్​.. వన్డేల్లో తొలి సెంచరీని సాధించాడు. గౌతీతో కలిసి నాలుగో వికెట్​కు 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం 107 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 150 పరుగులతో గంభీర్ అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్​లో టీమిండియా.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇప్పటివరకు వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు కోహ్లీ. 2019లో ఈ ఫార్మాట్​లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్​ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 27 సెంచరీలు కింగ్ కోహ్లీ పేరుమీద ఉన్నాయి.

ఇవీ చూడండి.. 'న్యూజిలాండ్ పర్యటనలో రాణించడమే లక్ష్యం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Chengdu - 24 December 2019
1. Chinese Premier Li Keqiang walking into summit room
2. South Korean President Moon Jae-in walking into summit room
3. Japanese Prime Minister Shinzo Abe sitting
4. Wide of summit meeting
5. Li speaking
6. Moon speaking
7. Abe speaking
8. Various of meeting
STORYLINE:
Leaders from China, Japan and South Korea met on Tuesday against the backdrop of increasing threats from North Korea's nuclear and missile programmes.
The trilateral meeting in the southwestern Chinese city of Chengdu comes amid demands by Pyongyang for sanctions relief by the end of the year and threats that it may take unspecified actions if that relief is not forthcoming.
The assembled leaders — Chinese Premier Li Keqiang, Japanese Prime Minister Shinzo Abe, and South Korean President Moon Jae-in — are also expected to discuss furthering regional cooperation on the economy, the environment and people-to-people exchanges.
The trilateral summits date back to the fallout from the 1997 Asian financial crisis, which devastated businesses across the region and prompted moves toward greater economic integration.
The three countries account for about 24 percent of world trade, and have tightly-bound supply chains, with more than $720 billion in trade moving between them last year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.