సరిగ్గా పదేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో సెంచరీ చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు సురేశ్ రైనా. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో అప్పటి ఫొటోలను పంచుకున్నాడు. తన జీవితంలోని మధురమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటని, టీమిండియా తరఫున తొలి శతకం చేయడం ఎంతో గొప్పగా అనిపించిందని, ధైర్యాన్ని ఇచ్చిందని రాసుకొచ్చాడు.
-
One of the most memorable moments for me. Scoring a first ever T20i century for my country undoubtedly filled me with a lot of confidence, energy & a never ending zest of giving my 100% to my game every time I’m on the field. pic.twitter.com/1b7MdthbIP
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">One of the most memorable moments for me. Scoring a first ever T20i century for my country undoubtedly filled me with a lot of confidence, energy & a never ending zest of giving my 100% to my game every time I’m on the field. pic.twitter.com/1b7MdthbIP
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 2, 2020One of the most memorable moments for me. Scoring a first ever T20i century for my country undoubtedly filled me with a lot of confidence, energy & a never ending zest of giving my 100% to my game every time I’m on the field. pic.twitter.com/1b7MdthbIP
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 2, 2020
దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది భారత్. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన రైనా.. మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకుని 60 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. టీమిండియా తరఫున తొలి టీ20 సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. ఈ పోరులో 14 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ప్రస్తుతం టీమిండియా నుంచి టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు శతకాలు చేయగా, కేఎల్ రాహుల్ రెండు సెంచరీలతో ఉన్నారు.
పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన రైనా.. ఐపీఎల్లోనూ ఆకట్టుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు. కరోనా వల్ల ప్రస్తుత సీజన్ నిరవధిక వాయిదా పడింది.