ETV Bharat / sports

'మహీ' తొలి అంతర్జాతీయ శతకానికి పదహారేళ్లు

author img

By

Published : Apr 5, 2021, 9:50 AM IST

2005 ఏప్రిల్ 5.. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం.. పాకిస్థాన్​తో వన్డే మ్యాచ్​. వన్​డౌన్​లో బ్యాటింగ్​కు వచ్చిన జులపాల జుట్టు కుర్రాడు ఎడాపెడా బౌండరీలు కొడుతున్నాడు. చూస్తుండగానే సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. అది అతడి తొలి అంతర్జాతీయ శతకం. అతడే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అతడి మొదటి మూడంకల మార్క్​కు నేటితో పదహారేళ్లు పూర్తైన సందర్భంగా నాటి మ్యాచ్​ను ఓ సారి గుర్తు చేసుకుందాం.

On this day in 2005: Dhoni scored his first international century
ధోనీ తొలి అంతర్జాతీయ శతకానికి పదహరేళ్లు

సరిగా 16 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ.. తన అంతర్జాతీయ కెరీర్​లో తొలి శతకం సాధించాడు. విశాఖ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన రెండో వన్డేలో మహి మూడంకెల స్కోరు అందుకున్నాడు.

వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్​ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో టాస్​ గెలిచిన భారత్​.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే సచిన్ వికెట్ కోల్పోయిన టీమ్​ఇండియా.. ఫస్ట్​ డౌన్​లో ధోనీని బ్యాటింగ్​కు దింపింది. సెహ్వాగ్​తో కలిసి 96 పరుగులు జోడించాడు మహీ. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వీరూ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ద్రవిడ్​తో జతకట్టిన ఈ ఝార్ఖండ్ డైనమైట్.. మూడో వికెట్​కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇదీ చదవండి: లుకేమియాను జయించి.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి

అంతర్జాతీయ కెరీర్​లో తొలి శతకం బాదిన ధోనీ.. 15 ఫోర్లు, 4 సిక్స్​ల సాయంతో 123 బంతుల్లోనే 148 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్​తో భారత్​ 9 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ప్రత్యర్థిని 298 పరుగులకే కట్టడి చేసింది.

మొత్తం సుదీర్ఘ కెరీర్​లో 350 వన్డేలు ఆడిన మహి.. మూడు ఫార్మాట్లలోనూ భారత్​కు సారథిగా వ్యవహరించాడు. ఐసీసీ మేజర్​ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ అతడే కావడం విశేషం. ఐపీఎల్​లో చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ.. మూడు సార్లు టైటిల్​ను అందించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాడు.

ఇదీ చదవండి: నిలకడైన ఆటతో.. రైజర్స్‌ రైట్‌ రైట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.