ETV Bharat / sports

ఇంగ్లాండ్ ఆనందానికి.. న్యూజిలాండ్ వేదనకు ఏడాది - England vs New Zealand CWC FINAL

వన్డే ప్రపంచకప్​లో ఇంగ్లాండ్ తొలిసారి విజేతగా నిలిచి ఏడాది పూర్తయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​కు సంబంధించిన విశేషాలు మరోసారి గుర్తు చేసుకుందాం.

ఇంగ్లాండ్ ఆనందానికి.. న్యూజిలాండ్ విషాదానికి ఏడాది
ప్రపంచకప్​తో ఇంగ్లాండ్
author img

By

Published : Jul 14, 2020, 12:28 PM IST

Updated : Jul 14, 2020, 2:22 PM IST

క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌. ఆ జట్టు ప్రపంచకప్‌ కల సాకారం చేసుకోడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. గతేడాది ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో తలపడిన ఇంగ్లిష్‌ జట్టు అనూహ్య రీతిలో విజేతగా నిలిచి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఇరుజట్లూ సమాన స్కోర్‌ చేయడం వల్ల మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అక్కడా రెండు జట్లు నువ్వా నేనా అనే రీతిలో పోరాడాయి. చివరికి ఇందులోనూ స్కోర్లు సమమయ్యాయి. చేసేది లేక బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్‌కు నేటితో ఏడాది.

కివీస్‌ స్కోర్‌ తక్కువే.. కానీ

newzeland cricket team
న్యూజిలాంజ్ క్రికెట్ జట్టు

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 241/8 స్వల్ప స్కోర్‌ చేసింది. హెన్రీనికోల్స్‌(55), టామ్‌ లాథమ్‌(47), కేన్‌ విలియ్సన్‌(30) ఓ మోస్తారు స్కోర్లతో జట్టును ఆదుకున్నారు. లేదంటే న్యూజిలాండ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇంగ్లాండ్‌ బౌలర్లు క్రిస్‌వోక్స్‌(3/37), లియమ్‌ప్లంకెట్‌(3/42) చెలరేగడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం ఇంగ్లాండ్‌ విజయం నల్లేరుమీద నడకలా అనిపించినా అంత సాఫీగా సాగలేదు. ఆది నుంచీ న్యూజిలాండ్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడం వల్ల ఆతిథ్య జట్టుకు లక్ష్యం చిన్నదైనా కొండంతలా పెరిగింది. ఫైనల్‌ మ్యాచ్‌ అనే ఒత్తిడి ఆ జట్టులో స్పష్టంగా కనిపించింది. మధ్యలో బెన్‌స్టోక్స్‌(84), జాస్‌బట్లర్‌(59) ఆదుకోడం వల్ల ఆ జట్టు నిలదొక్కుకుంది.

బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ

45వ ఓవర్‌లో బట్లర్‌ ఔటయ్యాక కివీస్‌ బౌలర్లు పుంజుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంగ్లాండ్‌ టెయిలెండర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్టోక్స్‌ ఒంటరిపోరాటం చేశాడు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన స్థితిలో ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌ చేశాడు. మరోవైపు స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ క్రీజులో ఉన్నారు. తొలి రెండు బంతులకు పరుగులు రాకపోవడం వల్ల స్టోక్స్‌ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్లో షాట్‌ ఆడి రెండు పరుగులు తీశాడు. కానీ ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. స్టోక్స్‌ రెండో పరుగుకోసం ప్రయత్నించగా అప్పుడే ఫీల్డర్‌ బంతిని అందుకొని త్రో విసిరాడు. అది నేరుగా వెళ్లి డైవ్‌ చేస్తున్న స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరింది. అలా ఓవర్‌త్రో కారణంగా నాలుగు అదనపు పరుగులు లభించాయి. మొత్తంగా 6 పరుగులు వచ్చాయి. ఇక ఇంగ్లాండ్‌కు కావాలసింది రెండు బంతుల్లో 3 పరుగులే. ఐదో బంతికి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా అదిల్‌ రషీద్‌ రనౌటయ్యాడు. చివరి బంతికి మళ్లీ రెండు పరుగులు అవసరం.. ఈసారి మార్క్‌వుడ్‌ రనౌటయ్యాడు. దీంతో స్కోర్లు సమం కాగా, మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

ben stokes
ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్​ స్టోక్స్

సూపర్‌ ఓవర్‌లోనూ ఉత్కంఠే..

సూపర్‌ ఓవర్‌లో బట్లర్‌, స్టోక్స్‌ మరోసారి బ్యాటింగ్‌కు దిగారు. ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ ధాటిగా ఆడి చివరికి 15 పరుగులు పూర్తిచేశారు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా అన్నే పరుగులు చేసింది. జేమ్స్‌ నీషమ్‌, మార్టిన్‌ గప్తిల్‌ బ్యాటింగ్‌ చేశారు. వీళ్లు కూడా బాగా ఆడడం వల్ల మరోసారి స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్‌ మరోసారి టై అయినా బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. 2015లో ఆ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

Last Updated : Jul 14, 2020, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.