కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఈ మార్గదర్శకాలను మరచిపోయి.. మైదానంలో సహచరులను కౌగిలించుకుంటూ కనిపించాడు. సౌతాంప్టన్లో వెస్డిండీస్తో జరిగిన తొలి టెస్టు మూడో రోజులో ఈ సంఘటన జరిగింది.
వెస్టిండీస్ బ్యాట్స్మన్ షేన్ డౌరిచ్ వికెట్ను పడగొట్టిన ఆనందంలో అండర్సన్ తన జట్టు సహచరులను ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మ్యాచ్లో ఎవరు భౌతిక దూరం పాటించడం లేదంటూ.. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాసీర్ హుస్సేన్ అన్నారు. పాత అలవాట్లు దూరం కావడం కష్టమని అభిప్రాయపడ్డారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మ్యాచ్ను సురక్షితంగా నడిపించేందుకు ఐసీసీ నూతన మార్గదర్శకాలను సూచించింది. ఇందులో శరీరాలను తాకుతూ సంబరాలు చేసుకోవడం, డ్రింక్ బాటిల్స్, టవల్స్ తదితర మహమ్మారి సోకే వీలున్న వస్తువుల వినియోగంపై నిబంధనలు విధించింది ఐసీసీ. అయితే ఆటలో లాలాజలం నిషేధంతో పాటు కొత్త మార్గదర్శకాలకు అలవాటు పడటం కష్టమని క్రికెటర్లు పేర్కొన్నారు.
-
Jimmy makes the breakthrough! 👏
— England Cricket (@englandcricket) July 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WS
">Jimmy makes the breakthrough! 👏
— England Cricket (@englandcricket) July 10, 2020
Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WSJimmy makes the breakthrough! 👏
— England Cricket (@englandcricket) July 10, 2020
Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WS
ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు ఆధిపత్యంతో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 204 పరుగులు చేయగా.. కరీబియన్ జట్టు 114 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి:'చెమటతో బంతికి మెరుపు తెప్పిస్తున్నాం'